కేంద్రానికి కేటీఆర్ కీలక ప్రతిపాదన

Update: 2020-01-10 10:23 GMT
మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఓ పెట్టుబడుల సదస్సులో నిన్న పాల్గొన్న ఆయన శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి తో కేటీఆర్ చర్చించారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన కేటీఆర్ ఈ సందర్భంగా వరంగల్-హైదరాబాద్, హైదరాబాద్ -నాగపూర్ కారిడార్ లు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్-బెంగళూరు-చెన్నైలను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ ను కోరారు. ఇందుకోసం కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని విన్నవించారు.

కేటీఆర్ ప్రస్తావించిన పలు అంశాలపై స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన కార్యాలయ సిబ్బందిని వెంటనే ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.
Tags:    

Similar News