ఈసారి జె న్యూన్.. కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటి

Update: 2019-01-09 08:21 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ ప్రమాణం చేసి నెలరోజులు కావస్తున్నా ఇంకా మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ చేపట్టలేదు. ఇప్పట్లో మంచి మూహుర్తాలు లేనందున సంక్రాంతి పండుగ తర్వాత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులతోపాటు పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇందుకోసం ఇప్పటికే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎవరెవరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలనేది చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడిన నాయకులకు పదవుల భర్తీలో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కొద్దిరోజుల్లోనే నామినేటెడ్ పదవులకు ఉత్తర్వులు వెలువడుతాయని టీఆర్ఎస్ లోని కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు.

ఇక కీలకమైన మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో కేసీఆర్ కు కేటీఆర్ సలహాలు ఇస్తున్నారు. అంతేకాకుండా టీఆర్ ఎస్ సంస్థాగత వ్యవహారాల విషయంలో ఇద్దరు చర్చించుకున్నట్లు తెల్సింది. పార్టీ పదవులు, నామినేటె్ పోస్టులు వంటివి అన్ని కలుపుకొని ఐదారు వందల వరకు ఉంటాయని వాటన్నింటిని పార్టీ కోసం కష్టపడిన వారికి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగానే సోమవారం నామినేటెడ్ ఎమ్మెల్సేగా స్టీఫెన్సన్ ను కేసీఆర్ నియమించారు. అంతేకాకుండా మంగళవారం పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ గా మారాడ్డి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఇంకా రానున్న రోజుల్లో కీలకమైన ఆర్టీసీ చైర్మన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులను భర్తీ చేయనున్నారు.  ఈసారి ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ప్రజలు ఇచ్చిన అఖండ మెజార్టీని బేస్ చేసుకొని టీఆర్ ఎస్ లో గడిచిన ఎన్నికల్లో కష్టపడ్డ వారు.. ఉద్యమకారులకు పదవులివ్వాలని నిర్ణయించారు.దీంతో కష్టపడ్డ నేతలకు ఈసారి న్యాయం జరగబోతోందనే వార్తలు ప్రగతి భవన్ నుంచి వెలువడుతున్నాయి. 



Full View

Tags:    

Similar News