కేటీఆర్‌ కు ఆక్సిడెంట్‌ కు..దుబాయ్ టూర్‌ కు లింకేంటి?​

Update: 2016-03-01 12:36 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి  త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కే తార‌క‌రామారావుకు ఆక్సిడెంట్ అయిందా?  విదేశీ టూర్‌ కు వెళ్లిన‌పుడు ఈ ఆక్సిడెంట్ జ‌రిగిందా? సీఎం అధికారిక నివాసాన్ని వీడి కేటీఆర్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డానికి కార‌ణం ఆయ‌న కాలికి త‌గిలిన గాయ‌మేనా? అత్యంత‌ విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వీట‌న్నింటికీ అవును అనేదే స‌మాధానం!

మంత్రి కేటీఆర్ ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. అనుకోకుండా అక్క‌డ ఓ మైన‌ర్ ఆక్సిడెంట్ జ‌రిగింది. ఈ ఆప‌రేష‌న్‌లో కాలి మ‌డ‌మ ప్రాంతంలో స‌రిగ్గా చెప్పాలంటే చీల‌మండ ద‌గ్గ‌ర ఎముక చిట్లింది. దీంతో కేటీఆర్ అక్క‌డే ఆప‌రేష‌న్ చేయించుకొని తిరిగి హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు. అయితే గాయం తీవ్రంగా ఉండ‌టాన్ని గ‌మ‌నించిన‌ కేటీఆర్ తండ్రి - సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసు వీడ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. ఎంత స్ప‌ష్టంగా చెప్పారంటే..కేసీఆర్‌ ను క‌లిసేందుకు క్యాంప్ ఆఫీసుకు వ‌చ్చే వారిని కూడా క‌ల‌వ‌వ‌ద్ద‌ని ఇటు కేటీఆర్‌ కు అదే స‌మ‌యంలో త‌న‌యుడిని క‌ల‌వ‌వ‌ద్ద‌ని నాయ‌కుల‌కు స్ప‌ష్టం చేశారు. దీంతో కేటీఆర్ దాదాపు వారం రోజుల పాటు క్యాంప్‌ ఆఫీసుకే ప‌రిమిత‌మ‌య్యారు. వ‌రంగ‌ల్‌ - ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి  వెళ్ల‌నిది కూడా ఇందుకే.

ఇదిలాఉండ‌గా కొద్దిగా నొప్పిత‌గ్గిన నేప‌థ్యంలో సోమ‌వారం గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్యాచ‌ర‌ణ‌పై అడుగులు వేశారు. ఆ మ‌రుస‌టిరోజు న‌గ‌రంలో హెలీకాప్ట‌ర్ రైడ్‌ ను ప్రారంభించారు. అయితే అనంత‌రం క్యాంప్ ఆఫీసులో జ‌రిగిన స‌మీక్ష‌లో కాలికి ప‌ట్టీతో స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

-గ‌రుడ‌
Tags:    

Similar News