కేటీఆర్ క‌నిపించ‌డం లేదు.. కొంచెం చెబుతారా? హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్లు

Update: 2021-09-30 02:30 GMT
``కేటీఆర్ క‌నిపించ‌డం లేదు.. మీరేమైనా చూశారా? `` ఇలాంటి పోస్ట‌ర్లు ఇప్పుడు హైద‌రాబాద్‌లో వెలిశాయి. ఎక్క‌డ చూసినా.. ఇవే క‌నిపిస్తున్నాయి.తెలంగాణ మంత్రి, అధికార పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు.. కేటీఆర్‌ను కార్న‌ర్ చేస్తూ.. వెలిసిన ఈ పోస్ట‌ర్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. నిత్యం కేటీఆర్ హైద‌రాబాద్ గ‌ల్లీల్లోనే తిరుగుతుంటారు. చిన్నా పెద్దా.. అంద‌రినీ ప‌ల‌క‌రిస్తారు. అంతేకాదు.. ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పాద‌యాత్ర‌లు చేశారు. త‌న పార్టీ అభ్య‌ర్తుల‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ క్ర‌మంలోనే అనేక వ‌రాలు కూడా కురిపించారు. న‌ల్లాలు బాగుచేయిస్తాన‌న్నారు. డ్రైనేజీ స‌మ‌స్య‌లు తీరుస్తాన‌ని చెప్పారు.

అయితే.. తాజాగా వ‌చ్చిన గులాబ్ తుఫాన్‌తో హైద‌రాబాద్ చివురుటాకులా ఒణికి పోయింది. బాధిత ప్రాంతంగా నిలిచింది. ఎటు చూసినా.. మోకాల్లోతు నీరు ద‌ర్శ‌న మిచ్చింది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కుచుక్క‌లు చూపించింది. కాల‌నీల‌కు కాల‌నీలే నీట‌మునిగాయి. గంట‌లు కాదు.. రోజుల త‌ర‌బ‌డి ప్ర‌జ‌లు నీటిలోనే ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్ప‌టికీ.. చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్నాయి. రెండు రోజుల పాటు ఏక‌ధాటిగా కురిస‌న వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోయారు. ఒక‌వైపు వ‌ర‌ద‌లు.. మ‌రోవైపు వ‌ర్షాల‌తో ఇళ్లు మునిగి.. ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డాలు. అంతేకాదు.. కొంత‌మంది బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి కూడా ఏర్ప‌డింది.

కొన్ని ప్రాంతాల్లో అయితే.. డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా లేక‌.. ఇళ్లు నీళ్ల‌లో మునిగిపోయాయి. మొత్తంగా చూస్తే.. గులాబ్ ప్రభావం భాగ్య‌న‌గ‌రంపై భారీ ఎత్తున క‌నిపించింది. మ‌రి ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌.. ఎక్క‌డ ఉన్నారు. ఎంత‌మందికి ఆప‌న్న హ‌స్తం అందించారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇదే విష‌యం ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల రూపంలో చుట్టుముడుతోంది. క‌నీసం.. ఒక్క‌టంటే.. ఒక్క ఏరియాకు కూడా ఆయ‌న రాలేద‌ని.. తాము తిన్నామా? ఉన్నామా? అ ని కూడా ప‌ట్టించుకోలేద‌ని .. ఇక్క‌డి వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. అధికారులు కూడా త‌మ‌వైపు చూడ‌లేద‌ని అంటున్నారు.

త‌మ మానాన త‌మ‌ను బ‌తికితే బ‌త‌కండి.. ఛ‌స్తే చావండి! అన్న‌ట్టుగా వ‌దిలి వేశార‌ని .. ప్ర‌జ‌లు ఘొల్లు మంటున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్లోని కొన్ని కాల‌నీల వాసులు త‌మ క‌డుపు మంట‌కు కొత్త రూపం ఇచ్చారు. స‌హ‌నం న‌శించిన కొంద‌రు ప్ర‌జ‌లు.. కేటీఆర్ ఫొటోతో పెద్ద పెద్ద పోస్ట‌ర్ల‌ను ముద్రించి.. `కేటీఆర్ క‌నిపించ‌డం లేదు`  అనే టైటిల్‌తో పోస్ట‌ర్ల‌ను హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఈ పోస్ట‌ర్ల‌లో మంత్రి కేటీఆర్ త‌న విధుల‌ను నిర్వ‌ర్తించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న ఎక్క‌డైనా క‌నిపించారా? అంటూ.. ప్ర‌శ్న‌లు గుప్పించారు. మొత్తంగా ఈ పోస్ట‌ర్లు.. ప్ర‌స్తుతం రాజ‌కీయ క‌ల‌క‌లం రేపుతున్నాయి. అదేస‌మ‌యంలో సామాన్యుల ఫోన్ల‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి దీనిపై అధికార పార్టీ ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి. 
Tags:    

Similar News