తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా శుక్రవారం తెలంగాణ భవన్ లో రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటి అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై రాష్ట్ర కమిటీ సభ్యులతో సుధీర్ఘంగా చర్చించారు.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి చేరిన వారితోపాటు అనాదిగా టీఆర్ఎస్ నమ్ముకున్న వారు పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరినీ సమన్వయం చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం కేటీఆర్ అండ్ కోకు కత్తిమీద సామే.. ఈనేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో ముగ్గురితో త్రిమెన్ కమిటీని నియమించాలని కేటీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కమిటీ జిల్లాల వారీగా మున్సిపల్ అభ్యర్థుల ఎంపికకు విధివిధానాలు ఖరారు చేసి జిల్లా అధ్యక్షులకు మార్గనిర్ధేశం చేస్తుంది. జిల్లా కమిటీలు అభ్యర్థులను వడబోసి ఎంపిక చేస్తారు.
వడబోసిన జాబితాను త్రిమెన్ కమిటీ, కేటీఆర్ పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తారు. కేసీఆర్ అనుమతితో అభ్యర్థులను ప్రకటిస్తారు. కేటీఆర్ ఈ మేరకు సమావేశంలో యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు సమాచారం.