అరె.. బావకు గ్రీటింగ్స్ చెప్పలేదేం కేటీఆర్

Update: 2016-06-03 17:04 GMT
విదేశీ పర్యటనల్లో బిజీబిజీగా ఉంటూ పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాష్ట్రం విషయాల్ని మర్చిపోయారంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. తాను ఎక్కడున్నా.. తెలంగాణలో ఏం జరుగుతుంది? తమ ప్రత్యర్థులు తమపై ఏ తీరులో రియాక్ట్ అవుతున్నారు? అలాంటి అంశాల మీద ఆయన డేగ కన్నేసి ఉంటారన్న విషయం డిగ్గీ రాజా ఎపిసోడ్ తో స్పష్టమైంది. తెలంగాణ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఊహించని పంచ్ ఇచ్చి షాక్ ఇవ్వటం తెలిసిందే.

తెలంగాణ అంటూ రాసిన అక్షరాల్లో స్పెల్లింగ్ మిస్టేక్ ను పట్టుకొని.. ముందు తెలంగాణ అని తప్పు లేకుండా రాసి కేసీఆర్ గురించి విమర్శించు అంటూ కేటీఆర్ అన్న మాటకు డిగ్గీ రియాక్ట్ అయ్యింది లేదు. ఈ ఎపిసోడ్ చెప్పేదేమిటంటే.. కేటీఆర్ ఎక్కడున్నా.. ఆయన మనసు మొత్తం తెలంగాణ చుట్టూరా.. తన పార్టీ చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది. మరి.. ఇంత అప్ డేటెడ్ గా ఉండే ఆయన.. తన బావ అయిన హరీశ్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవటం ఏమిటి?

గతంలో అయితే ఇద్దరి మధ్య అధిపత్యపోరు అన్నట్లుగా వాతావరణం ఉండేది. తనకు అనుకూలమైన వాతావరణం లేదని అర్థం చేసుకున్నారో లేక కేటీఆర్ తో పోలిస్తే తన పరిధి ఏమిటన్న విషయంపై స్పష్టత వచ్చిందేమో కానీ.. నెంబర్ గేమ్ ల మీద క్లియర్ గా సమాధానం ఇచ్చేయటమే కాదు.. కేసీఆర్ తర్వాత కేటీఆరే వారసుడు అన్న దానిపై ఎలాంటి కామెంట్ చేయకుండా ఆచితూచి వ్యవహరిస్తుండటం తెలిసిందే. గతంలో కేటీఆర్ కు దూరంగా ఉన్నట్లుగా కనిపించే హరీశ్.. ఈ మధ్యన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ.. బావకు ట్విట్టర్ సాక్షిగా బర్త్ డే విషెస్ ఎందుకు చెప్పనట్లు..? హరీశ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేనంత బిజీగా కేటీఆర్ ఉన్నారా..?
Tags:    

Similar News