చేలో చావుగంటతో తెలంగాణ రాష్ట్రం కొద్ది రోజులుగా దద్దరిల్లిపోతోంది. బతుకు మీద ఆశ సన్నగిల్లి.. ఏం చేయాలో తోచక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు చెప్పేందుకు మాటలు రాని తెలంగాణ రాష్ట్ర సర్కారు.. విపక్షాలకు మాత్రం సుద్దులు చాలానే చెబుతుంది. విపక్షాలు ఎలా ఉండాలి? జానా.. చిన్నారెడ్డి.. జీవన్ రెడ్డి లాంటి వారు ఎలా ఉండాలో చెప్పే మంత్రి కేటీఆర్.. తమ సర్కారు రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవటాన్ని మాత్రం మాట వరసకు మాత్రం ప్రస్తావించరు.
మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు వింటే విస్మయం కలగక మానదు. ఎందుకంటే.. రైతుల ఆత్మహత్యల గురించి.. దాని నుంచి తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా తప్పిస్తామన్న విషయాన్ని చెప్పకున్నా.. విపక్షాలు ఏం చేయాల్న మాటల్ని చెబుతూ.. అరవైఏళ్లుగా సాగిన దరిద్రాన్ని.. పదహారు నెలల్లో పోగొట్టటం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు.
అరవైఏళ్ల దరిద్రం మాకొద్దనే కదా తెలంగాణ ప్రజానీకం మిగిలిన పార్టీలన్నింటిని వదిలేసి టీఆర్ ఎస్ కు అధికారాన్ని ఇచ్చింది. పదహారు నెలలు స్వల్ప కాలమే.. అయినా.. ఈ కాలంలో చేసిందేముందన్నది ప్రశ్న. వాటర్ గ్రిడ్ మాదిరి.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఎప్పటికి మార్చగలుగుతారో చెబితే బాగుంటుంది కదా.
ఎంతసేపటికి మేం అధికారంలోకి వచ్చి 16 నెలలు మాత్రమే అని చెప్పే కన్నా.. రెండేళ్లు లేదంటే మూడేళ్లు.. కాదంటే నాలుగుళ్లలో అన్నదాతల సమస్యలన్నీ తీర్చేస్తామన్న మాట ఎందుకు రావటం లేదు?
అసెంబ్లీలో జానారెడ్డి.. చిన్నారెడ్డి..జీవన్ రెడ్డి లాంటి అనుభం ఉన్న నేతలు రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేలా మాట్లాడతారని ఆశించామని.. కానీ అందుకు భిన్నంగా మాట్లాడటం బాధ కలిగించిందంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే.. జానారెడ్డి.. చిన్నారెడ్డి లాంటి వారు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ.. ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని.. రైతుల విషయాన్ని బ్రహ్మాండంగా పట్టించుకుంటుందని.. తన పొలంలో పంట వేస్తే మూడు రోజులు దగ్గరుండి మరీ పంటే ఎలా వేస్తున్నారో చూసుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఒకచోటకు చేర్చి.. వారి సమస్యల్ని పరిష్కరించేందుకు ఎందుకు సమయం వెచ్చించటం లేదు.
ఇలాంటివి సాధ్యం కాదనుకుంటే.. ఆత్మహత్యలపై కోదండరాం.. ప్రొఫెసర్ హరగోపాల్.. చుక్కా రామయ్యలు లాంటి తెలంగాణ పెద్దల నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి.. ఆత్మహత్యలపై ఒక నివేదిక ఇవ్వాలని.. ఏమేం చేయాలో సూచించాలో ఎందుకు కోరటం లేదు? పార్టీ నేతలకు పదవులు ఇచ్చేందుకు చిత్రవిచిత్రమైన పదవుల్ని.. ఎక్కడో పుస్తకాల్లో ఉన్న రూల్స్ ను బయటకు తెచ్చి మరీ పదవులు కట్టబెట్టే కేసీఆర్ అలాంటి పనులు ఎందుకు చేయటం లేదు? సమస్యల్ని పరిష్కరించే కన్నా.. రాజకీయం మీదా.. రాజకీయ పార్టీలను విమర్శించే అంశాల మీద దృష్టి పెట్టటం తెలంగాణ అభివృద్ధికి శాపంగా మారిందని చెప్పక తప్పదు. ముందు వాళ్లు మారాలి.. వీళ్లు మారాలని చెప్పే కేటీఆర్ లాంటి వారు ముందు వారి మైండ్ సెట్ ను మార్చుకుంటే బాగుంటుందేమో.