ఆ కలపై కేటీఆర్ తాజామేట విన్నారా?

Update: 2016-03-31 04:37 GMT
హైదరాబాద్ రూపురేఖలు మార్చేయటమే కాదు.. దేశ ఐటీ రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే అవకాశం ఉన్న ఐటీఐఆర్ కలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ రూపురేఖలతో పాటు.. తెలంగాణ అభివృద్ధకి కీలకంగా మారే ఈ ప్రాజెక్టు ప్రాక్టికల్ అయ్యే అవకాశం లేదన్న విషయాన్ని తేల్చేశారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ గా కంటే కూడా ఐటీఐఆర్ గా సుపరిచితమైన ఈ ప్రాజెక్టు కల సాకారం కావటంపై కేటీఆర్ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ ప్రాజెక్టును నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి కేటాయించారు. దీంతో లక్షలాది ఉద్యోగాలతో పాటు లక్షల కోట్ల రూపాయిల ఐటీ పెట్టుబడులు వస్తాయని.. హైదరాబాద్ సినిమాటిక్ గా మారిపోతుందంటూ పెద్ద సినిమానే చూపించారు.

అయితే.. ఈ కల సాకారమయ్యే అవకాశం కనిపించటం లేదని కేటీఆర్ తేల్చారు. మోడీ సర్కారు ఈ ప్రాజెక్టుకు కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు ఇవ్వటం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా నిధుల కోసం కేంద్రాన్ని పలుమార్లు సంప్రదించి రూ.3వేల కోట్లు కోరితే.. ఇప్పటికి రూ.165 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కేంద్రం సహకారం లేకున్నా ఐటీ రంగ విస్తరణ విషయంలో రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందంటున్న కేటీఆర్.. ఐటీఐఆర్ ప్రాజెక్టును సంపన్నమైన తెలంగాణ రాష్ట్రమే సొంతంగా చేపడుతుందన్న మాటను ఎందుకు చెప్పలేకపోతున్నట్లు?
Tags:    

Similar News