తెలంగాణ ఐటీ - పంచాయతీ రాజ్ - పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కు ఆయన కలల మంత్రిత్వ శాఖ అయిన ఐటీలోనే ఒకింత చేదు ఫలితం వచ్చే పరిస్థితులను తెలివిగా ఎదుర్కున్నారా? ఐటీలో ప్రధానమైన పాలసీతో పాటు మరో4 అనుబంధ పాలసీలు తీసుకువచ్చిన కేటీఆర్ కేంద్రం ప్లాన్‌కు దీటుగా స్పందించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ప్రత్యక్షంగా 15లక్షల మందికి ఉపాధి... పరోక్షంగా 53 లక్షల మందికి బతుకుదెరువు... రాష్ట్రానికి పన్నుల రూపంలో 30వేల కోట్ల ఆదాయం... తెలంగాణలో నెలకొల్పుతామన్న ఐటీఐఆర్ పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిన హామీలివి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడంతో ఇవన్నీ గాలికి కొట్టుకుపోయనట్టే కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ కు ఐటీఐఆర్ ను మంజూరు చేశారు. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో చేసిన ఈ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగింది. తెలంగాణ ఉద్యమకాలంలో ఐటిఐఆర్ ను ప్రకటించడంతో కేంద్రానికి తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఈ ప్రాజెక్టు ఇచ్చారని సీమాంధ్ర నేతలు చెబితే, ఉద్యమానికి దీనికి సంబంధం లేదని, అంతకుముందు తీసుకున్న నిర్ణయమని కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఐటిఐఆర్ తో హైదరాబాద్ స్వరూపమే మారిపోతుందని ఆశలు రేకెత్తించారు.
సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఓడిపోయి, బిజెపి సొంతబలంతో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు గురించి బిజెపి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ప్రాజెక్టును రద్దు చేసినట్టు చెప్పడం లేదు. నిధులు కేటాయిస్తామని కూడా అనడం లేదు. ఐటి మంత్రి కేటీఆర్ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఆరుసార్లు కేంద్రాన్ని కలిసి ఈ మేరకు విన్నవించారు.ఐటిఐఆర్ కోసం మూడువేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రం కోరితే, కేంద్రం ఇప్పటి వరకు కేవలం 160 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పట్ల కేంద్రం ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సైతం దాదాపు ఆశలు వదులుకుంది. ఐటిఐఆర్ ప్రాజెక్టు నుంచి వెనక్కి తప్పుకుంటున్నామని కేంద్రం ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో ఉంది. అయితే కేంద్రం దీనిపైనా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఐటిఐఆర్ తో సంబంధం లేకుండానే ఐటి విస్తరణ కోసం నూతన ఐటి పాలసీలను తీసుకువచ్చారని తెలుస్తోంది.
పాలసీ ఆవిష్కరణ రోజే సుమారు 2500 కోట్లు రూపాయల పెట్టుబడులు,దాదాపు 27 వేల కోట్ల పెట్టుబడులు దిశగా ఎంఓయూలు కుదర్చుకోవడం ఇందులో భాగమేనని చెప్తున్నారు. ఐటీ విషయంలో తమ విజ్ఞప్తులను పట్టించుకోలేకపోయినా తాము నిలదొక్కుకున్నామనే అభిప్రాయాన్ని తెలియజెప్పడం ఈ అడుగులకు వెనక వ్యూహమని విశ్లేషిస్తున్నారు.