క్యాన్స‌ర్ పేషెంట్‌ ట్వీట్ కేటీఆర్‌ ను క‌దిలించింది

Update: 2018-01-17 07:39 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ - మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్ మంత్రిగా ఎంత బిజీగా ఉంటారో...ఆన్‌ లైన్‌ లో అంతే అందుబాటులో ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. ట్విట్ట‌ర్‌లో మంత్రి కేటీఆర్ చురుకుగా స్పందించే తీరు - ఆయ‌న‌కున్న ఫాలోయింగ్‌ చూసి ఓ టాప్ సెల‌బ్రిటీ అనే భావ‌న చాలా మందికి క‌లుగుతుంది. అయితే అలాంటి కేటీఆర్‌ ను ఉద్దేశించి ఓ యువకుడు చేసిన ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. అందులోనూ ఆ యువ‌కుడు క్యాన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుడు కావ‌డం - పైగా ఆస్ప‌త్రిలో నుంచి ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

లింఫోమా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సుమంత్‌ గుత్తా అనే యువ‌కుడు మంత్రి కేటీఆర్‌ కు చేసిన‌ ట్వీట్ పలువురిని ఆకట్టుకుంది. `నాకు క్యాన్సర్ ఉన్నట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొన్నిరోజుల వ్యవధిలో కీమోథెరఫీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. మీ పరిపాలన నాకు చాలా బాగా నచ్చుతుంది. నా ఆరోగ్యం కోలుకోవడం గురించి కూడా మీ అభ్యర్థనలు - ప్రార్థనల్లో అవకాశం కల్పించండి. చీర్స్!` అని సుమంత్‌ గుత్తా ట్వీట్‌ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. `నీ ఆరోగ్యం కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా సుమంత్. నీకు ఆరోగ్యవంతమైన - ఆనందమయ జీవితం దక్కుతుందని ఆకాంక్షిస్తున్నా. లింఫోమా క్యాన్సర్‌ పై నువ్వు గెలిచిన తర్వాత మనం కలుద్దాం. క్యాన్సర్‌ ను గెలిచిన తీరు గురించి తెలియజేస్తూ మరికొందరికి స్ఫూర్తినిద్దాం అని మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఇదిలాఉండ‌గా...మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని ప్రతినిధిబృందం సోమ - మంగళవారాల్లో దక్షిణకొరియాలోని పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు - ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వనరులు - నూతన పారిశ్రామిక విధానం గురించి మంత్రి వివరించి.. తమ రాష్ట్రంలో వ్యాపారాలకు - పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆటోమొబైల్ - టెక్స్‌ టైల్ - ఫార్మా - ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నామ్ గుహ్నేతో సమావేశం సందర్భం గా మంత్రి.. తెలంగాణలోని ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
Tags:    

Similar News