తెలంగాణ రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. ఆయన కుమారుడు తాజా మాజీ మంత్రి కేటీఆర్ కానీ.. ఇక వారి కుటుంబానికి చెందిన కేటీఆర్ సోదరి కమ్ ఎంపీ కవిత కానీ వారెవరూ రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. వ్యక్తిగత అంశాలు.. కుటుంబ విషయాల గురించి దాదాపుగా మాట్లాడరు. అంతదాకా ఎందుకు.. పార్టీ వేదికల మీద కానీ మరెక్కడైనా సరే.. కొడుకు.. కుమార్తెలను మిగిలిన పార్టీ నేతల మాదిరే కేసీఆర్ చూస్తుంటారు తప్పించి..కొడుకు.. కూతురు అన్నట్లుగా వ్యవహరించే ధోరణి అస్సలు కనిపించదు.
కుటుంబ విషయాలు ఇంట్లోనే అన్నట్లుగా ఉండే కేసీఆర్ ఫ్యామిలీ పాలసీకి తగ్గట్లే.. కేటీఆర్ తీరు ఉంటుంది. పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చే ఆయన.. ఎక్కడా తన భార్య గురించి కానీ.. పిల్లల గురించి కానీ మాట్లాడటం కనిపించదు. అలాంటి తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
తన కొడుకు హిమాన్షు శరీరాకృతి (లావుగా) గురించి విపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా వదలకుండా టార్గెట్ చేస్తున్నారన్నారు. 13 ఏళ్ల చిన్నపిల్లోడు. ఏం తప్పు చేశాడు? అతని శరీరాకృతి గురించి ఇష్టం వచ్చినట్లుగా ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు.
తన కొడుకును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. వ్యక్తిగతంగా విషం చిమ్మటం చూస్తుంటే..రాజకీయాల్లో ఉండటం అవసరమా? అని అనిపించిందన్న కేటీఆర్.. అది చాలా బాధాకరమైన పరిస్థితిగా అభివర్ణించారు. చిన్నపిల్లాడైన తన కొడుకును గురించి విపక్ష నేతలు విరుచుకుపడిన తీరుపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్న కేటీఆర్ వేదనను అర్థం చేసుకోవచ్చు. మరి.. ఎంత రాజకీయం అయితే మాత్రం.. తెలంగాణను ఇచ్చిన సోనియాను ఉద్దేశించి.. అమ్మా.. బొమ్మా అంటూ నోరు పారేసుకోవటం గురించి కూడా ఇంతే ఆత్మవిమర్శ కేటీఆర్ చేసుకుంటే బాగుంటుందేమో?