సామాన్యుడి ఫిర్యాదుపై రియాక్ట్ అయిన కేటీఆర్

Update: 2018-08-19 05:25 GMT
సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజ‌కీయ ప్ర‌ముఖుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక‌రు. త‌న‌కు తానుగా చేసే ట్వీట్ల‌తో పాటు.. సామాన్యులు త‌న దృష్టికి తీసుకొచ్చేలా ఫిర్యాదు ట్వీట్ల‌పైనా.. సాయం కోరుతూ చేసే ట్వీట్ల‌పైనా ఆయ‌న త‌న‌దైన శైలిలో రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఒక సామాన్యుడి చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. సీరియ‌స్ ఆదేశాలు జారీ చేశారు.

మాదాపూర్ లోని ఒక భ‌వన నిర్మాణ‌దారుడి తీరును త‌ప్పు పెడుతూ సామాన్యుడు ఒక‌రు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ ఫిర్యాదు చేశారు. రోడ్డు ప‌క్క‌నే ఒక భ‌వ‌న నిర్మాణం కోసం సెల్లార్ త‌వ్వారు. క‌నీస జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోకుండా ప‌నులు చేస్తున్న వైనాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన  కేటీఆర్.. ఈ తీరు ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని.. వెంట‌నే జీహెచ్ ఎంసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. దీనికి బాధ్యులైన వారిపై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. దీనిపై జీహెచ్ ఎంసీ అధికారులు ఓకే స‌ర్.. పాయింట్ నోటెడ్ అంటూ రియాక్ట్ అయ్యారు.  భ‌వ‌న నిర్మాణ‌దారుడిపై కేసు న‌మోదు చేసి.. ఆ ప్రాంతాన్ని సీజ్ చేయాల‌న్న కేటీఆర్ ఆదేశాలు ప‌లువురు నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

సామాన్యుడి ఫిర్యాదుపై మంత్రి స్పంద‌న బాగుంద‌ని పేర్కొంటున్నారు. ఈ ఎపిసోడ్‌ లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఫిర్యాదు చేసిన సామాన్యుడి ట్వీట్ ను ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తొల‌గించ‌టం. అత‌డి ఆచూకీ బ‌య‌ట‌కు రాకుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకొన్న వైనం మ‌రింత బాగుంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.
Tags:    

Similar News