తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధం ఆడేశారు. పూర్తి వివరాలేమి తెలుసుకోకుండానే ఆయన మాట్లాడేసి అడ్డంగా బుక్ అయిపోయారు. ఓ మంత్రి స్థాయిలో ఉండి సీఎంగా ఉన్న తన తండ్రి గురించి ఆయన మరీ ఎక్కవ చేసి చెప్పినా వాస్తవంలో అది అబద్ధమైంది. ఇంతకు మ్యాటర్ ఏంటంటే సోమవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో ఫేస్ బుక్ ఫర్ బిజినెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియా కు ఉన్న క్రేజ్ ఎనలేనిది...దీనిని విరివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని...దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని ఫేస్ బుక్ ఫాలోయింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉంది..ఫేస్ బుక్ లో కేసీఆర్‌కు 2.75 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని..ఇంతమంది ఫాలోవర్స్ దేశంలో ఏ సీఎంకు లేరని ఆయన కేసీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు.
ప్రభుత్వ పథకాల ప్రచారానికి కూడా ఫేస్ బుక్ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఇంతకు కేటీఆర్ కేసీఆర్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ లో దేశంలోనే టాప్ అని ఫస్ట్ ర్యాంకు కూడా ప్రకటించేశాడు. టెక్నాలజీకి పితామహుడు, ఐటీ సీఎంగా పేరున్న పొరుగు రాష్ర్ట సీఎం చంద్రబాబు ఫేస్ బుక్ ను 4.63 లక్షల మంది ఫాలో అవుతున్నారు. వీరిద్దరి కంపేరిజన్ చేసి చూస్తే కేసీఆర్ కన్నా చంద్రబాబుకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఎక్కువ. అని కేటీఆర్ కేసీఆర్ కు ఫస్ట్ ర్యాంకు ఇచ్చేయడం వింతగా ఉంది.
ఓ రాష్ర్టానికి మంత్రిగా ఉన్న వ్యక్తి రేపు ప్రభుత్వ పథకాలపై, ప్రభుత్వం గురించి కూడా ఇలాగే మాట్లాడేస్తారా అన్న వ్యాఖ్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై ఐటీ సీఎం చంద్రబాబు శ్రేణులు ఎలా స్పందిస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది