హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో మాటల మంటలు చెలరేగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓట్లు చీల్చి విజయావకాశాలను ప్రభావితం చేసేలా తయారైంది. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.
హుజూరాబాద్ బైపోల్ లో రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గోల్కొండ రిసార్ట్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి-ఈటల రాజేందర్ రహస్యంగా కలుసుకున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ ను గెలిపించడం కోసం కాకుండా.. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రహస్య భేటి జరగలేదని వారు ఖండిస్తే ఫొటోలు, ఇతర ఆధారాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ లో అనామకుడిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని.. చేతనైతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. నాగార్జునసాగర్ లో బీజేపీకి డిపాజిట్ దక్కనట్లే.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని జోస్యంచెప్పారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా పుట్టిన పార్టీలు కేసీఆర్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిల హుజూరాబాద్ లో ఎందుకు పోటీ చేయడం లేదని కేటీఆర్ ను ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ఓటు బ్యాంకును పథకం ప్రకారం చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రపన్నిందని.. గాంధీభవన్ లో గాడ్సే దూరాడంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారని గుర్తు చేశారు. సీనియర్లను పక్కనపెట్టి ఆర్ఎస్ఎస్ మూలాలున్న ‘గట్టి అక్రమార్కుడు’ అంతా నడిపిస్తున్నాడని విమర్శించారు.
ఈడీ, సీబీఐని బీజేపీ ఎలా వాడుకుంటుందో దేశమంతా చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఈటల తప్పు చేయకపోతే సీఎంను కలిసి వివరణ ఇచ్చుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. మహారాష్ట్ర సీఎంను తిట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చూస్తున్నారని.. అక్కడి పరిణామాలను కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ సీఎంను పట్టుకొని కొందరు 420గాళ్లు బూతులు తిడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయాల్లో డిగ్నీటి ఉండాలన్నారు. ఏపీలో జరిగిన సంఘటనపై కూడా కేటీఆర్ స్పందించారు. టీడీపీ ఆఫీసులపై దాడికి మూలం ఏంటో తెలుసుకోవాలన్నారు. రాజకీయాల్లో ఎందుకు అసహనం అంటూ ప్రశ్నించారు. టీడీపీ అక్కడ అధికారం పోయిందని.. ఇక్కడ అంతర్థానమైపోయిందని కేటీఆర్ విమర్శించారు.