ఈ కాలంలో ఉద్యోగాల కల్పన అనేది పెద్ద టాస్క్. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని మాత్రమే ఉంటాయి. అదే ప్రైవేటు రంగంలో బోలెడు ఉంటాయి. వాటిని క్యాష్ చేసుకోవడమే మిగిలింది.. దాన్ని అక్షరాల అందిపుచ్చుకుంటున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణను పెట్టుబడుల స్వర్గధామంగా మలుస్తున్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణకు పెట్టుబడుల వరద వస్తోంది. త్వరితగతిన స్పందిస్తూ పెట్టుబడుదారులను ఆకర్షిస్తున్న వైనం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణకు వరదలా పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా కేరళలో పెట్టుబడి పెట్టడానికి వెళ్లిన కిటెక్స్ గ్రూప్ ఎండీ సాబు జాకబ్, ఆయన బృందానికి అక్కడి ప్రభుత్వం సరైన ఆదరణ కల్పించలేదు. దీంతో వారంతా అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. కేరళలో పెట్టుబడి పెట్ట వద్దని డిసైడ్ అయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఒక ప్రైవేట్ జెట్ ను కేరళకు పంపారు. తెలంగాణకు రప్పించి వారికి స్థలం కంపెనీ ఏర్పాటుకు మౌళిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో 1100 కోట్ల పెట్టుబడులకు కేటెక్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టేందుకు ఓకే చెప్పింది. కేటీఆర్ చొరవకు తెలంగాణకు ఓ భారీ పెట్టుబడి వచ్చింది.
కేటెక్స్ గ్రూప్ ఎండీ సాబు జాకబ్ ఒక నెల వ్యవధిలో 11 తనిఖీలు నిర్వహించారని.. కేరళ ప్రభుత్వం తాము పెట్టుబడి పెడుతామంటే తమను వేధిస్తోందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వానికి పెట్టుబడులు రావడం ఇష్టం లేదా? అంటూ మాట్లాడారు. కేరళకు గతంలో ప్రకటించిన రూ.3500 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకుంటానని కిటెక్స్ గ్రూప్ ఎండీ జాకబ్ బెదిరించాడు. తాను కేరళను విడిచిపెట్టలేదని.. వాళ్లే తమను తరిమివేస్తున్నారని బాధపడ్డాడు.
ఈ పరిణామం తర్వాత తొమ్మిది రాష్ట్రాలు జాకబ్ ను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సంప్రదించాయి. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా కిటెక్స్ గ్రూప్ తమ రాష్ట్రాల్లో పెట్టుబడులుపెట్టాలని రాయితీలు ప్రకటించాయి.
దీంతో వెంటనే చురుకుగా స్పందించిన మంత్రి కేటీఆర్ ఒక ప్రైవేట్ జెట్ ను కేరళకు పంపారు. కిటెక్స్ గ్రూప్ ఎండీ, ప్రతినిధుల బృందాన్ని హైదరాబాద్ రప్పించారు. అనంతరం వారితో భేటి అయ్యారు.
తెలంగాణలో వస్త్ర విభాగానికి అవసరమైన వనరుల లభ్యత, చేనేతరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పిల్లల వస్త్రాల తయారీ సంస్థ కిటెక్స్ తెలంగాణలో రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. వరంగల్ లోని కేఎంటీపీలో వారు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు. దీంతో కేటీఆర్ వేగంగా స్పందించడం.. ప్రైవేట్ జెట్ విమానం పంపించడం వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసలు కురుస్తున్నాయి.