ప్రభుత్వానికి.. అధికారులకు మధ్య అనుకోని విధంగా ఏదైనా వివాదం తలెత్తినా.. ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకున్నా కొంత ప్రతిష్ఠంభన చోటు చేసుకుంటుంది. అలాంటి వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. సుదీర్ఘకాలం పాటు విపక్ష నేతగా.. ఉద్యమ నేతగా వ్యవహరించిన కేసీఆర్ కు ఇలాంటి వాటి వల్ల జరిగే లొల్లి.. దాని ప్రభావం ప్రభుత్వం మీద ఎంత పడుతుందన్న విషయం ఆయనకు తెలియంది కాదు. అందుకేనేమో తాజాగా తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యేకు.. అటవీశాఖాధికారులకు మధ్య నెలకొన్న పంచాయితీని సెట్ చేసే పనిని కొడుకు కేటీఆర్ కు అప్పజెప్పారు.
మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో అటవీ శాఖ అధికారి రామేశ్వర్ రెడ్డిపై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాలరాజు దాడి చేశారన్న ఆరోపణ ఉంది. ఈ వ్యవహారం అంతకంతకు పెరిగి.. చివరకు సామూహిక సెలవులు.. ఇతర ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లటంతో ఆయన వెంటనే రియాక్ట్ అయి.. సమస్య మరింత పెద్దది కాకుండా ఉండేందుకు తన కొడుకు కమ్ మంత్రి కేటీఆర్ కు ఈ ఇష్యూను సెటిల్ చేయాలని సూచించారు.
దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్.. ఇరు వర్గాలను తన ఇంటికి పిలిపించి విడివిడిగా మాట్లాడారు. అనంతరం వారి మధ్య నెలకొన్ని వివాదాన్ని పరిష్కరించటంతో పాటు.. ఇరు వర్గాల్ని కూర్చోబెట్టుకొని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. విషయాన్ని సెటిల్ చేయటం గమనార్హం. మామూలుగా అయితే.. ఇలాంటివి మీడియా దృష్టికి రాకుండా క్లోజ్ చేస్తారు. కానీ.. తాజా ఉదంతంలో పంచాయితీ చేసి.. దాన్ని అధికారికంగా.. ఎవరూ విమర్శలు చేసే వీలు లేకుండా ఉండేలా సెట్ చేసిన వైనం చూసినప్పుడు కేటీఆర్ తెలివితేటల్ని అభినందించకుండా ఉండలేం.
ఇక.. ఈ ఇష్యూకు సంబంధించి ఎమ్మెల్యే బాలరాజు ‘దాడి’ ఇష్యూపై విచారం వ్యక్తం చేయగా.. ఎమ్మెల్యే విచారాన్ని‘అర్థం’ చేసుకున్న అటవీ శాఖ అధికారులు తాము తలపెట్టిన ఆందోళనల్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఏది ఏమైనా సమస్య ముదరకుండానే మొదటే తుంచేసిన తీరును అభినందించాల్సిందే.