టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ చాలా బిజీ బీజీగా రోజంతా గడుపుతున్నారు. ఎంత బీజీగా ఉన్నా సోషల్ మీడియాకు మాత్రం కొంత సమయాన్ని వెచ్చిస్తూ ప్రజలతో, అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. తాజాగా కేటీఆర్ తన ఖాతాలో పోస్టు చేసిన ఓ ఫన్నీ వీడియో హాస్యాన్ని పంచడంతోపాటు వైరల్ గా మారింది..
కేటీఆర్ ట్వీటర్లో పోస్టు చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక కంచె అవతల ఉంటారు. ఓ వ్యక్తి కంచె అవతల ఉన్న కర్ర సహాయంతో లోపల పడిపోయిన సెల్ ఫోన్ ను తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈక్రమంలోనే అతడి చేతిలో ఉన్న కర్ర చేజారి కంచె అవతల పడిపోతుంది. కాగా పక్కనే ఉన్న మరో వ్యక్తి కంచె దూకి అవతలి వైపుకు వెళతాడు. అటువైపు ఉన్న ఫోన్ ను తీసుకురాకుండా ఆ వ్యక్తి కేవలం కర్రను మాత్రమే తీసుకొని కంచె దూకుతాడు. అంత కంచె దూకి సెల్ ఫోన్ తీసుకురాకుండా కర్ర తీసుకొచ్చిన యువకుడి యవ్వారం నవ్వులు పూయించింది.
ఈ వీడియో హాస్యాన్ని పూయిస్తోంది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో ఈ వీడియోపై కామెంట్లు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కేటీఆర్ కూడా ఈ వీడియోలోని ఆ రెండో వ్యక్తి ని ఉద్దేశిస్తూ ‘‘స్మార్టెస్ట్ గై అవార్డు గోస్ టూ..’’ అంటూ తన ట్వీటర్లో పోస్టు చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ వీడియో ఏవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం తెలియడం లేదు. ఇది సైటర్ అని.. కచ్చితంగా ఇది తెలంగాణలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి పేల్చిన కామెడీ బిట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.. కాంగ్రెసోళ్లు లక్ష్యాన్ని సాధించకుండా ఇలా ఊతకర్రల కోసం పాకులాడుతారనే అర్థం వచ్చేలా వీడియో ఉంది. ట్వీటర్ వేదికగా ప్రజల సమస్యలను పరిష్కరించే కేటీఆర్ ఇలా ప్రతిపక్ష పార్టీలను వీడియోలతో సెటైర్లు వేస్తూ హాస్యాన్ని కూడా పంచడం అందరినీ ఆకట్టుకుంటోంది.
For Video Click Here