చిన్న నాటి మధుర జ్ఞాపకాలని ట్విట్ చేసిన కేటీఆర్

Update: 2019-12-09 06:54 GMT
బాల్యం ప్రతి ఒక్కరి జీవితం లో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి బాల్యం ఎన్నో మరచి పోలేని జ్ణాపకాలని , అనుభూతులని పంచి పెడుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే మనసుకి పట్టలేని ఆనందం. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలనిపిస్తుంది. అప్పటి ఆటలు ఆడాలనిపిస్తుంది. కానీ , జీవితం అనేది ముందుకు సాగుతుంది తప్ప ..గతంలోకి మనల్ని తీసుకోని వెళ్ళదు. మనమే ఆ గతాన్ని గుర్తు చేసుకోవాలి అంతే.

ఇకపోతే తెలంగాణ మంత్రి కేటీఆర్ పార్టీ వ్యవహారాలు , ప్రభుత్వ కార్యక్రమాలతో ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటారు. అయినప్పటికీ అయన సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్‌ గా ఉంటారో అందరికీ తెలిసిందే. నిత్యం రాజకీయ, సామాజిక అంశాలపైనే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో పోస్టులు చేస్తుంటారు. అలాగే తనకు ట్వీట్ చేసి.. సహాయం కోరితే.. ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

అయితే , మంత్రి కేటిఅర్ ఎక్కువ గా ట్విట్టర్ ని వ్యక్తిగత విషయాలని పంచుకోవడానికి వాడరు. అయితే తాజాగా ఆదివారం కోన్ని ట్వీట్స్ చేశారు. వ్యక్తి గతమైన పోస్టులు ఎక్కువగా పెట్టని ఆయన.. ఒక్కసారిగా ఆయన చిన్న నాటి ఫోటో లని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. త్రోబ్యాక్‌ సండే హ్యాష్‌ట్యాగ్‌ తో తన చిన్నతనంలో ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ కవిత తో ఉన్న ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌చేశారు. బాల్యంలో తన సోదరి కవిత తో పాటు.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అలాగే తన తాతగారు జే. కేశవరావుతో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని.. ఆ సమయంలో జైలుకు కూడా వెళ్లారని.. మా అందరికీ ఆయన ఎంతో గర్వ కారణమని ట్వీట్‌ లో తెలిపారు.


Tags:    

Similar News