ప్రత్యర్థుల మీద విరుచుకుపడటానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో అన్నింటిని దాదాపుగా టచ్ చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. తాజాగా సరికొత్త తరహా వాదనను వినిపిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించే ముందు.. తమ కుటుంబం ఎన్ని త్యాగాలు చేసిందో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మీకు తెలీటం లేదు.. మా ఫ్యామిలీ త్యాగాలకు పుట్టినిల్లు అన్నట్లుగా కేటీఆర్ మాటలు ఉంటున్నాయి. ప్రాజెక్టుల కోసం తమ భూముల్ని ఉదారంగా ప్రభుత్వాలకు ఇచ్చేసిన పెద్ద మనసు తమ కుటుంబాలదన్నట్లుగా కేటీఆర్ తాజా మాటలు ఉంటున్నాయి. తాజాగా తమ ప్రభుత్వం మొదలు పెట్టిన రైతుబంధు చెక్కుల్ని రైతులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. విపక్షాలపై కొత్త తరహాలో టార్గెట్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబిడ్డ అని.. ఆయనకు రైతుల కష్టాలు తెలుసని.. అందుకే ఆయన రైతు బాంధవుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. దీన్ని తట్టుకోలేని బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారి మాటల్లో అర్థం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12వేల కోట్లు మంజూరు చేస్తే పర్యావరణం పేరుతో కాంగ్రెస్ నేతలు కోర్టులతో అడ్డుకుంటున్నారన్నారు. భూ నిర్వాసితుల కష్టాలు తన తండ్రికి తెలుసన్న కేటీఆర్.. తన తండ్రి తన సొంత భూమిని అప్పరుమానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇచ్చినట్లుగా వెల్లడించారు.
తన తండ్రి గొప్పతనాన్ని కీర్తించిన కేటీఆర్.. తన అమ్మమ్మ చేసిన త్యాగాన్ని చెప్పటం ద్వారా.. తామెంత త్యాగమయి ఫ్యామిలీనో తెలుసా? అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. తమ అమ్మమ్మ కుటుంబం నుంచి దాదాపు 300 ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణాల కోసం ఇచ్చినట్లుగా చెప్పారు. మొత్తానికి ప్రాజెక్టులకు భూములు పోవటం తమ కుటుంబానికే జరిగిందని.. తమకు ప్రాజెక్టు నిర్వాసితుల బాధలు తెలుసన్నట్లుగా కేటీఆర్ చెప్పుకున్నారు.
తమ ఫ్యామిలీ త్యాగాల లిస్ట్ విప్పిన కేటీఆర్.. పనిలో పనిగా ప్రతిపక్షాల మీదా విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల పనుల్లో భాగంగా ఉత్తమ్.. జానా.. డీకే అరుణ లాంటి వారి భూములు ఏమీ పోలేదని మండిపడ్డారు. ఇప్పటివరకూ తెలంగాణ ప్రజల కోసం తన తండ్రి కమ్ సీఎం కేసీఆర్ చేసిన పనుల గురించి ప్రస్తావిస్తున్న కేటీఆర్.. ఇప్పుడు తమ ఫ్యామిలీ త్యాగాల చిట్టాను విప్పుతున్న తీరు కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉందని చెప్పక తప్పదు.