తెలంగాణ క్యాబినెట్ లో సీఎం కేసీఆర్ తర్వాత తనది రెండో స్థానమంటూ ఇన్నాళ్లు మంత్రి తుమ్మల చేసిన కామెంట్స్
ఆయనకే ఇబ్బందికరంగా మారుతున్నాయా? టీఆర్ ఎస్ అగ్రనేతలు తుమ్మల సొంత జిల్లా నుంచే పక్కలో బల్లెంను సిద్దం చేస్తున్నారా? ఈ క్రమంలో తుమ్మల వలే పార్టీలో చేరిన నేతలతో పాటు పార్టీ నాయకులతో చెక్ పెట్టిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీ నుండి పోటీచేసి ఓటమి పాలైన తుమ్మలను టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పట్టుబట్టి ఎమ్మెల్సీ చేసి మరీ తెలంగాణ క్యాబినెట్ లోకి చేర్చుకున్నారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాలో టీడీపీకి చెందిన బలమైన వర్గమంతా గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలోనే తుమ్మల వ్యతిరేకవర్గమంతా ఒక్కటై సీఎం కేసీఆర్ ను కలిశారు. రాజకీయంగా దశాబ్ధాలుగా ఆయనతో ఉన్న వైరాన్ని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. పార్టీ పదవులు - నామినేటెడ్ పదవుల పంపిణీలో జరిగే అన్యాయాన్ని ముందే పూసగుచ్చినట్టు వివరించారు. అయితే పార్టీ బలోపేతం కోసం ఆయనను తీసుకుంటున్నామని వారిని సముదాయించారు. వారందరికి ఓదార్చిన ఆయన అందరి రాజకీయ భవిష్యత్ కు తనదే భరోసా అని హమీ ఇచ్చారు. కొద్దిరోజులకే జరిగిన క్యాబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రిగా అవకాశమిచ్చారు. ఇక్కడవరకు బాగానే ఉన్న అసలు రాజకీయం ఇక్కడే మొదలైందంటున్నారు.
పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలలో తుమ్మలను రంగంలోకి దింపిన అధిష్ఠానం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెంటనే పార్టీలోకి రప్పించింది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ టీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు. అంతకు ముందే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యలు పార్టీ మారిన వారి జాబితాలో ఉన్నారు. పొంగులేటితోపాటు మిగిలిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు కూడ గులాబీ గూటికి చేరారు. దీంతో జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలకు గాను ఏడుగురు అధికార పార్టీకి చెందిన వారు ఉన్నట్లయింది. జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు పదవులు ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. దీనిని గమనించిన ఆయన వ్యతిరేక వర్గం తుమ్మలకు చెక్ పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకీ తీసుకువచ్చారు. అందులో భాగంగానే ఖమ్మం కార్పోరేషన్ మేయర్ గా పాపాలాల్ పేరు ఖరారైంది. సీఎం కేసీఆర్ కూడ తొలి నుండి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాదాన్యత నివ్వాలని సూచించడంతో తప్పని పరిస్థితులలో తుమ్మల ముఖ్య మంత్రి ఆదేశాలను అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగిలిన పదవుల పంపకాల లోను ఇదే ఫార్ములాను అనుసరించేందుకు తుమ్మల వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ప్రస్తుత ఖమ్మం జిల్లా రాజకీయాలలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో చీలిక స్పష్టంగా కనపడుతోందంటున్నారు. తుమ్మలతో పాటు పార్టీలో చేరిన టీడీపీ నేతలు ఒక వర్గంగా ఉండగా టీడీపీకి వ్యతిరేకంగా పోరాడి టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మరోవర్గంగా ఉన్నారు. ఇందులో తుమ్మల వ్యతిరేక వర్గానికి సీనియర్ నేత జలగం వెంకట్రావుతో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్ తో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరచూ సమావేశమవుతుండటం కూడా ఈ వర్గం ఎత్తుగడలో భాగమే అంటున్నారు.