తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వరాష్ట్రంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి వేరే చెప్పక్కర్లేదు. మిగతా మంత్రులతో పోలిస్తే.. ఆయన దూకుడు బ్రేకుల్లేకుండా సాగుతోంది. అధికారులతో సమీక్షలే - క్షేత్రస్థాయి పర్యటనలు - సిబ్బందికి హెచ్చరికలు - ప్రజలకు అందుబాటులో ఉండడం - వాట్సాప్ మెసేజ్ లకు కూడా స్పందించడం ఇలా కేటీఆర్ ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అయితే, ఈయన ప్రతిభ ఇక్కడితో ఆగిపోలేదు. అంతర్జాతీయంగా కూడా కేటీఆర్ మెరిసిపోతున్నారు. తనదైన కార్యదక్షతకు ఇప్పుడు ఏకంగా శ్రీలంక ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానమే అందింది. అదికూడా దేశాభివృద్ధి కోసం మానవ వనరుల అభివృద్ది విధాన రూపకల్పనలో భాగంగా లంక ప్రభుత్వం తొలిసారి నిర్వహిస్తున్న హ్యూమన్ కాపిటల్ సమ్మిట్ లో పాల్గోనేందుకు కేటీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది.
ఈ కార్యక్రమంలో లంక ప్రధాని రణిల్ విక్రమాసింఘే పక్కన కూర్చోవడమే కాకుండా.. ఆయనతో కలసి ఓ ప్రధాన ప్రసంగం కూడా కేటీఆర్ చేయనున్నారు. ఆగస్టు 11 - 12 తేదీల్లో కొలంబోలో జరగనున్న ఈ సదస్సుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం ఉంది. ఈ సమావేశం టూరిజం - హాస్పిటాలిటీ - టెక్నాలజీ - పైనాన్సియల్ - లాజిస్టిక్స్ - నిర్మాణ - తయారీ రంగాల్లోని అవకాశాలపైన విసృతంగా చర్చించనుంది. 2020 నాటికి సుమారు పది లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా పాలసీ నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడనుంది. మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ఉద్యోగాలకు యువతను సంసిద్ధులను చేస్తున్న తీరుపై కేటీఆర్ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.
దీని ద్వారా అటు భారతదేశంలో, ఇటు తెలంగాణలో ప్రభుత్వాలు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రపంచానికి వివరించే అవకాశం కేటీఆర్‌కు లభించింది. ఇంతటి అవకాశం రావడంపై అందునా ఇంత చిన్న వయసులో రావడంపై కేసీఆర్ తనయుడు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “బిల్డింగ్ ఏ ప్యూచర్ రేడీ వర్క్ ఫోర్స్- ఇండియన్ ఏక్స్ పిరీయన్స్” అనే అంశంపైన తాను ప్రసంగించనున్నట్లు ట్వీట్ చేశారు. ఎంతైనా కేసీఆర్ తనయుడు తన తండ్రిని మించి ఇమేజ్ సంపాదిస్తూ అంతర్జాతీయంగా కూడా దూసుకుపోతున్నారనే చెప్పాలి.