ఇదే కేటీఆర్ రేంజ్ ను పెంచేస్తుంద‌ట‌!

Update: 2019-01-10 04:12 GMT
గులాబీ పార్టీ కొత్త బాస్ కేటీఆర్ హ‌వా ఇప్పుడు మామూలుగా లేద‌ట‌. ఆయ‌న మాటే మంత్రంగా మారింద‌ట‌. తండ్రి ముఖ్య‌మంత్రి అయితే కొడుకు రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో కేటీఆర్‌ను అభినందించాల్సిన అంశం ఒక‌టి ఉంది. తండ్రికి ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌ని తీరును ఇప్పుడు ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

వివాదాస్ప‌ద అంశాల జోలికి వెళ్ల‌క‌పోవ‌టం.. త‌న‌దైన టీంను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవ‌టంలో కేటీఆర్ ను వంక పెట్టాల్సిన అవ‌స‌ర‌మే లేదంటున్నారు. త‌నకు స‌న్నిహితులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న టీంలోని స‌భ్యులంద‌రికి ఈ మ‌ధ్య‌న ఆయ‌న ఒక వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ‌రూ ఎలాంటి త‌ప్పు చేయ‌టానికి వీల్లేద‌ని.. కక్కుర్తిప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. త‌నతో రిలేష‌న్ మిస్ చేసుకోవాల‌నుకునే వారు మాత్ర‌మే అలా చేయాల‌ని క‌రాఖండిగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ చీఫ్ గా .. సీఎం కొడుకుగా త‌న‌కున్న పవ‌ర్ ఏ మాత్రం మిస్ యూజ్ కాకూడ‌ద‌న్న భావ‌న‌లో ఆయ‌న ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏం జ‌రిగినా.. త‌న‌కు తెలియాన్న విష‌యాన్ని ఆయ‌న చాలా క్లారిటీతో చెప్పిన‌ట్లుగా స‌మాచారం. దీంతో.. కేటీఆర్ స‌న్నిహితులు ఇప్పుడు ఆచితూచి అన్న‌ట్లుగా అడుగులు వేస్తున్నారు.

ఇదే అంశం.. కేటీఆర్ కు ప్ల‌స్ గా మారిన‌ట్లుగా చెప్పాలి. చేతిలో ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు ఇష్టం వ‌చ్చినట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణికి భిన్నంగా ఉంటున్న కేటీఆర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివాదాల‌కు అవ‌కాశం లేకుండా ఉంటున్న ఆయ‌న తీరును చూస్తున్న ప‌లువురు నేత‌లు.. ఇలాంటి మైండ్ సెట్‌.. విజ‌న్ ఉన్న లీడ‌ర్ స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో లేర‌ని చెబుతున్నారు. ఎదిగే కొద్ది ఒదిగే త‌త్త్వం కేటీఆర్‌కు ప్ల‌స్ గా మార‌టమేకాదు.. ఆయ‌న్ను ఢీ కొట్టే నేత క‌నుచూపు మేర క‌నిపించ‌టం లేద‌న్న మాట ఇప్పుడు ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇంత‌కు మించి కేటీఆర్ నుంచి కేసీఆర్ సైతం కోరుకోరేమో?


Full View
Tags:    

Similar News