తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కరోనా వైరస్ ప్రబలినప్పటి నుంచి స్టైలిష్ మాస్క్ లను ధరిస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఆయన మాస్కులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేటీఆర్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులతో స్నేహంగా మెలిగే కేటీఆర్ ఈ మధ్య ధరించే మాస్కులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువత మనసును కొల్లగొడుతున్నాయి.
అయితే కేటీఆర్ పెట్టుకునే ఈ స్టైలిష్ మాస్కులు ఎక్కడ దొరుకుతాయి.? ఏం మాస్కులవి? చాలా బాగా ఉన్నాయని కేటీఆర్ ను సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. ఈ క్రమంలోనే దానికి జవాబునిచ్చారు కేటీఆర్.
మంత్రి కేటీఆర్ ఈ కరోనా కాలంలో చేనేతలకు అండగా నిలిచేందుకు వారు తయారు చేసిన హ్యాండ్లూమ్ కరోనా మాస్కులను వాడుతున్నట్టు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో తను ధరించే మాస్కులు ‘తెలంగాణ చేనేత హ్యాండ్లూమ్ సంస్థ’లో దొరుకుతాయని వివరించారు. కావాల్సిన వారు అందరూ ఈ మాస్కులు కొనాలని తద్వారా చేనేతలకు ఉపాధినివ్వాలని కోరారు.
దీంతో కేటీఆర్ మాస్కుల కథ వెనుక రహస్యం తెలిసింది. ఇది చేనేతలు తయారు చేసినవే కేటీఆర్ వీటిని ప్రమోట్ చేయాలని.. వారికి ఉపాధి కల్పించాలని వాటిని వాడుతున్నట్టు తెలుస్తోంది.