ఆత్మహత్య చేసుకున్న కుకునూరు పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ట్విస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిజాయితీపరుడైన తన భర్తను కావాలనే ఉన్నతాధికారులు హత్య చేశారంటూ ఆయన మరణంపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఆరోపణలు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తీరు మొదటి నుంచి వివాదాస్పదమే అన్నట్లుగా కొత్త ఆరోపణలు ఆయనపై వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ డీజీపీ కోటేశ్వరరావు ఆయన కుమార్తె సంచలన అంశాల్ని బయటపెట్టారు.
ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మామూళ్ల కోసం వేధింపులకు గురి చేసేవాడని.. న్యాయం చేయాలని వచ్చే వారిని బెదిరించి సెటిల్ చేసుకోవాలని చెప్పేవాడంటూ ఒక రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి ఆరోపణలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓపక్క ప్రభాకర్ రెడ్డి నిజాయితీపరుడని.. అతన్ని ఉన్నతాధికారులు వేధింపులకు గురి చేసేవారని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తుంటే.. అందుకు భిన్నమైన విమర్శలు చేస్తూ ఒక రిటైర్డ్ డీజీపీ అధికారి తెర మీదకు రావటం.. తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పటం ఇప్పుడు కొత్త ట్విస్ట్ అన్నట్లుగా మారింది.
రిటైర్డ్ డీజీపీ కోటేశ్వరరావు ఆయన కుమార్తె శ్వేత చేసిన ఆరోపణలు ఏంటంటే.. బంజారాహిల్స్ లో ఉన్న తన ఇంటిని దినేష్ రెడ్డితో పాటు మరొకరికి అద్దెకు ఇచ్చినట్లుగా చెప్పారు. కాఫీ షాప్ నిర్వహిస్తామని చెప్పి హుక్కా సెంటర్ ను నిర్వహించేవారని.. దీంతో.. తాను అభ్యంతరం వ్యక్తం చేస్తే పోలీసులు తమకు తెలుసని చెప్పినట్లుగా కోటేశ్వరరావు వెల్లడించారు.
ఈ ఉదంతంలో అప్పట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ గా వ్యవహరిస్తున్న ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి దినేష్ రెడ్డికి అనుకూలంగా చెప్పారన్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఇంకొకటి ఉంది. అదేమంటే.. రిటైర్డ్ డీజీపీ కోటేశ్వరరావు కుమార్తె శ్వేత ఓ ఛానల్ తో మాట్లాడుతూ.. పుష్కరాల సమయంలో బంజారాహిల్స్ ఎస్ఐ వినోద్ గౌడ్ వెళ్ళడంతో ప్రభాకర్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఇంచార్జ్ ఎస్ఐగా వచ్చినట్లుగా తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
కాఫీ షాప్ బదులు హుక్కా సెంటర్ ను నిర్వహిస్తున్న వైనాన్ని నిలదీసిన ఉదంతంలో ఎంటరైన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి.. ఈ ఇష్యూను సెటిల్ చేసుకోవాలని తనకు ఫోన్ లో చెప్పినట్లుగా రిటైర్డ్ డీజీపీ వెల్లడించారు. తన లాంటి వారికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల సంగతేమిటని ఆయన వాపోయారు. రూల్స్‌కు భిన్నంగా హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్న వైనంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే.. రిటైర్డ్ డీజీపీ కోటేశ్వరరావు కుమార్తె శ్వేత మాట్లాడుతూ.. హుక్కా సెంటర్ ఉదంతంతో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తనను బెదిరించారన్నారు. తనను స్టేషన్‌కు రావాలన్నారని.. అయితే మహిళా పోలీసులను తీసుకురావాలని తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. సూసైడ్ చేసుకున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తీరు సరిగా ఉండేది కాదన్నట్లుగా ఉన్న తాజా ఆరోపణలు నేపథ్యంలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్డ్ డీజీపీ స్థానంలో ఉన్న వ్యక్తి తనకు జరిగిన అన్యాయం గురించి డిపార్ట్ మెంట్ లోని తన సన్నిహితులకు ఎందుకు చెప్పలేదు? అన్నది ఒక క్వశ్చన్ అయితే.. మాజీ డీజీపీ విషయంలో ఒక ఎస్ఐ ఇలా చేయగలుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై సదరు కానిస్టేబుల్ భిన్న ప్రకటనలు చేయటంపై తాజా చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/