పాకిస్థాన్... ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన దేశంగా ఎప్పుడో అపకీర్తిని మూటగట్టేసుకుంది. అయితే ఆ ముద్ర నుంచి బయటపడేందుకు చేపట్టాల్సిన ఉగ్రవాద నిరోధక చర్యలకు బదులుగా ఆ దేశం... దాయాదీ దేశమైన భారత్ పై నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తూ... భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ తనదైన వ్యూహాలను అమలు చేస్తోంది. అయితే పాక్ బుద్ధి ఎరిగిన భారత్ కూడా ఎప్పటికప్పుడు ఆ దేశ ఎత్తులను చిత్తు చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటనలో పాక్ అడ్డంగా దొరికిపోయే ప్రమాదం నుంచి ఆ దేశం చివరి నిమిషంలో తనను తాను కాపాడుకుందన్న వాదన వినిపిస్తోంది. భారత్ - భారత పౌరులను దోషులుగా నిరూపించేందుకు పెద్ద స్కెచ్చే వేసిన పాక్... భారత్ కు చెందిన ఓ సామాన్య మహిళ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఘటనలో పాక్ తన దుర్బుద్ధిని మరోమారు నిరూపించుకున్నట్లుగా చెప్పక తప్పదు. ఇక అసలు ఆ ఘటన ఏమిటన్న విషయానికి వస్తే... పాక్ జైలులో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు ఆయన భార్య - తల్లికి పాకిస్థాన్ ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జాదవ్ ను కలిసేందుకు ఆయన తల్లి - భార్యకు అనుమతి ఇచ్చే ముందే పాక్ పక్కా స్కెచ్ వేసుకున్నట్లుగా ఇప్పుడు తేలిపోయింది.
ప్రపంచ దేశాల ముందు భారత్ ను - జాదవ్ ను దోషులుగా నిలటెట్టేందుకు పక్కా వ్యూహాన్ని రచించుకున్న తర్వాతే... పాక్ వారికి అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా భార్య - తల్లితో జాదవ్ ఏం మాట్లాడాలన్న విషయాలను ముందుగానే సిద్ధం చేసిన పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ ఐ... అందుకు జాదవ్ ను కూడా మానసికంగా సిద్ధం చేసింది. అయితే చివరి నిమిషంలో జాదవ్ తల్లి ఆ వ్యూహాన్ని పసిగట్టడమే కాకుండా పాక్ వ్యూహాన్ని తన సమయస్ఫూర్తితో వ్యవహరించి దానిని తుత్తునీయలు చేశారు. ఈ మొత్తం తతంగం ఎలా నడిచిందంటే.. అంతర్జాతీయ సమాజం ముందు జాదవ్ ను దోషిగా నిలబెట్టేందుకు గాను అతడి నోటి నుంచే తాను ఉగ్రవాదినని - పాక్ లో అల్లకల్లోలం సృష్టించానని కూడా పిలికించేందుకు ఆ దేశ అధికారులు పక్కా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పాక్ అనుమతితోనే అక్కడికి వెళ్లిన జాదవ్ తల్లి అవంతి - భార్య చేతనలు... పాక్ అధికారులు ఏర్పాటు చేసినట్లుగానే ఓ గ్లాస్ రూంలో కూర్చున్న జాదవ్ తో మాట్లాడారు. ఈ క్రమంలో మొత్తం వారు మాట్లాడుకున్న విషయాలను వీడియో తీసేందుకు నిర్ణయించిన పాక్... ఆ మొత్తం సంభాషణలను రికార్డు చేసింది.
పాక్ వ్యూహం ప్రకారం... పాక్ లో అల్లకల్లోలం సృష్టించానన్న మాటను జాదవ్ నోట నుంచే వచ్చేలా ప్లాన్ చేసింది. ఇందుకోసం జాదవ్ ను పాక్ అధికారులు నానా చిత్రహింసలకు కూడా గురి చేశారట. ఈ క్రమంలో పాక్ చెప్పినట్లుగానే మాట్లాడేందుకు సిద్ధపడ్డ జాదవ్... తల్లి - భార్యతో అవే మాటలను పలికారట. ఈ హఠాత్పరిణామంతో షాక్ కు గురైన అవంతి... ఇదంతా పాక్ ఆడుతున్న నాటకంగా గ్రహించేసి దానిని తన సమయస్ఫూర్తితోనే తిప్పికొట్టేందుకు అక్కడికక్కడే పథకం రచించారు. ఈ పథకంలో భాగంగా.. *ఇప్పుడు నువ్వెందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నావ్. ఇరాన్ లో వ్యాపారం చేస్తున్న నిన్ను పాకిస్తాన్ సైన్యం ఎత్తుకొచ్చింది కదా. నువ్వు నిజం చెప్పాలి* అంటూ ఆమె జాదవ్ మీద కోప్పడిందట. అయితే ఈ సంభాషణలను ఎలాగూ రికార్డు చేస్తున్నాం కదా... అన్న భావనతో వారి మధ్య సంభాషణను పాక్ అధికారులు అంతగా పట్టించుకోలేదట.
తీరా జాదవ్ తనను తాను నేరస్తుడిగా ఒప్పేసుకున్నాడు కదా. ఇక వీడియోను విడుదల చేద్దామన్న యోచనతో సదరు వీడియోను బయటకు తీసిందట. అయితే ఆ వీడియోలో జాదవ్ మాటలతో పాటు అవంతి మాటలు కూడా స్పష్టంగా రికార్డు అవ్వడంతో ఆ వీడియోను విడుదల చేయడాన్ని పాక్ ఆపేసిందట. ఎందుకంటే... తాను వేసిన ఎత్తు ప్రకారం జాదవ్ తనను తాను నేరస్తుడిగా ఒప్పేసుకున్నా... అతడిని బలవంతంగా అలా ఒప్పించారన్న విషయాన్ని అవంతి పరోక్షంగా బయట పెట్టింది. అవంతి మాటలు కూడా స్పష్టంగా రికార్డయ్యాయి. వీడియో విడుదల చేస్తే పాక్ నిజ నైజం మరోమారు ప్రపంచానికి తెలిసిపోతుంది. అలా కాకుండా అవంతి మాట్లాడిన మాటలను ఎడిట్ చేస్తే... ఇక పాక్ అడ్డంగా బుక్ కావడం ఖాయమే. మొత్తానికి భారత్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలపాలన్న పాక్ ప్లాన్ ను ఓ సాధారణ మహిళగా ఉన్న జాదవ్ తల్లి బోల్తా కొట్టించడం నిజంగానే ఆ దేశానికి షాకింగనే చెప్పాలి.