ప్రముఖ సోషల్ ఎంటర్ టైన్ మెంట్ యాప్ టిక్ టాక్ నిత్యం వార్తల్లో ఉండటం తెలిసిందే. అయితే.. తాజా వార్త మాత్రం రోటీన్ కు భిన్నంగా. ఈ యాప్ కారణంగా పరిచయమైన ఇద్దరి మధ్య ప్రేమ తొడిగి.. ఇద్దరూ ఒక్కటి కావటం విశేషంగా చెప్పాలి.
ఈ ఉదంతం కర్ణాటక రాష్ట్రంలోని బాగలకోటె జిల్లాలో చోటు చేసుకుంది. జమఖండికి చెందిన ప్రియాంక.. హుణసూరుకు చెందిన కుమార్ లు టిక్ టాక్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. సరదా వ్యాపకమైన పాటల్ని పాడుతూ.. ఆ వీడియోల్ని టిక్ టాక్ లో పోస్ట్ చేసేవాడు. అతడు అప్ లోడ్ చేసిన పాటల్ని చూసి ప్రియాంక లైక్ కొట్టేది.
ఇలా ఇద్దరి మధ్య పరిచయం.. చివరకు ఒకొరికొకరు ఫోన్ నెంబర్లు షేర్ చేసుకోవటం.. అలా మొదలైన వారి పరిచయం.. స్వల్ప వ్యవధిలోనే ప్రేమగా మారి.. పెళ్లి వరకు వచ్చింది. పేదరికంతో ఉన్న ప్రియాంక తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో.. కుటుంబ సమస్యల్ని పట్టించుకోని కుమార్ తాను ప్రేమించిన ప్రియాంకను పెళ్లాడేందుకు ఓకే చెప్పేశాడు.
దీంతో.. వీరి పెళ్లికి కుమార్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. వీరి పెళ్లిలో మరో ఆసక్తికర కోణం ఏమంటే.. వీరి పెళ్లికి పెద్దలుగా దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు నిలవటం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఇరు కుటుంబాల మధ్య వీరి పెళ్లి జరిగింది. మొత్తానికి టిక్ టాక్ తో ఒక జంట ఏకమైందని చెప్పాలి.