మీడియాతో స్నేహం ఎలాంటిదో చెప్పిన సీఎం!

Update: 2019-05-20 05:20 GMT
సుదీర్ఘంగా సాగిన ఎన్నిక‌ల క్ర‌తువులో ఆఖ‌రి విడ‌త పోలింగ్ ముగిసిన వెంట‌నే.. దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లు మీడియా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ ను వెల్ల‌డించారు. కేంద్రంలో కొత్త ప్ర‌భుత్వానికి ఆవ‌కాశం లేద‌ని.. ప్రాంతీయ పార్టీల హ‌వా పెద్ద‌గా న‌డ‌వ‌న్న అంచ‌నా వ్య‌క్త‌మైంది. కేంద్రంలో కొలువు తీర‌టానికి మోడీకి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని.. రెండోసారి ఆయ‌న విజ‌య‌వంతంగా ప్ర‌ధాని కావ‌టం ఖాయ‌మ‌న్న అంచ‌నాతో అన్ని ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేశాయి.

ఇదిలా ఉంటే.. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా పుంచుకున్న వైనాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అలాంటి రాష్ట్రాల్లో క‌ర్ణాట‌క ఒక‌టి ఉంటుంద‌ని ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేస్తున్నాయి. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ బాగా పుంచుకోవ‌టంతో పాటు.. అధికార జేడీఎస్.. కాంగ్రెస్ కు ఫ‌లితాలు నిరాశ క‌ల్పిస్తాయ‌న్న మాట‌ను రిపోర్టులు స్ప‌ష్టం చేస్తున్నాయి.

చేతిలో ప‌వ‌ర్ ఉన్న వేళ‌.. త‌మ గెలుపును అడ్డుకోవ‌టం సాధ్యం కాద‌న్న‌ట్లుగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఎగ్జిట్ ఫ‌లితాలు ఆయ‌న అంచ‌నాల‌కు భిన్నంగా ఉండ‌టంతో ఆయ‌న ముఖం చిన్న‌పోయింది. త‌న‌ను క‌లిసి మీడియా ప్ర‌తినిధుల‌పైన ఆయ‌న రుస‌రుస‌లాడారు. ఈ సంద‌ర్భంగా మీడియా మీద కొన్ని విమ‌ర్శ‌లు కూడా చేశారు.

మీడియాతో స‌హ‌వాసం డేంజ‌ర్ గా అభివ‌ర్ణించి ఆయ‌న తాను మీడియాతో స‌న్నిహితంగా ఉంటే నేత‌ల్లో ఒక‌రిగా చెప్పుకున్నారు. అలాంటిది ఈ మ‌ధ్య‌లో తాను కూడా మీడియాకు దూరంగా ఉంటున్న‌ట్లు చెప్పారు. మీడియాతో స‌న్నిహితంగా ఉండే రాజ‌కీయ నేత‌ల్లో దేశంలోనే తాను ముఖ్య‌మైన వ్య‌క్తిగా గొప్ప‌లు చెప్పుకున్న కుమార‌స్వామి.. ఇటీవ‌ల కాలంలో మీడియాతో మంచి గురించి మాట్లాడటం మానేసిన‌ట్లు చెప్పారు.

మండ్య ఎన్నిక‌ల్లో మీడియా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చూపించారని విచారం వ్య‌క్తం చేశారు. ఎల‌క్ట్రానిక్ మీడియా క‌థ‌నాల‌తో నిద్ర ప‌ట్టే అవ‌కావం లేద‌నిపించింద‌ని.. అందుకే వాట‌న్నింటికి తాను దూరంగా ఉంటున్న‌ట్లు చెప్పారు. రాజ‌కీయ నేత‌ల్ని కామెడీ న‌టుల్లా మీడియా మార్చేస్తుంద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. మీడియా తీరుపై స‌హ‌జంగా వారిపై ఉండే న‌మ్మ‌కం పోయింద‌న్నారు. స‌మాజంలో నిస్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అలా ఉండ‌టం లేద‌ని వ్యాఖ్యానించారు. కుమార‌స్వామి మాట‌ల్ని చూస్తుంటే..  మండ్య‌లో ఏదో లెక్క తేడా కొట్టిన‌ట్లు అనిపించ‌ట్లేదు?


Tags:    

Similar News