సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ చిత్తు అయిపోవడం, తనే స్వయంగా ఎంపీగా ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బాగా డిప్రెషన్లో కూరుకుపోయినట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి తను రాజీనామా చేస్తానంటూ రాహుల్ గాంధీ బాగా మారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంతమంది బతిమాలుతున్నా రాహుల్ గాంధీ మాత్రం మాట వినడం లేదట. రాజీనామాను ఉపసంహరించుకోవాలని సోనియాతో సహా కాంగ్రెస్ మిత్రపక్షాల వాళ్లు కూడా రాహుల్ ను ఈ విషయంలో బతిమాలుతున్నారు. ఇక ఈ విషయంలో కొత్తగా ట్రై చేశారట జేడీఎస్ నేత - కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. రాహుల్ కు తమ ఓటమి చరిత్రను చెప్పి ఊరడించాడట కుమారస్వామి.
'మాతో పోలిస్తే మీదో ఓటమా..' అన్నట్టుగా మాట్లాడరట కుమారస్వామి. తన తండ్రి దేవేగౌడ ప్రధానమంత్రిగా వ్యవహరించిన తర్వాత - తమ పార్టీ ఎన్నిసార్లు ఓడిపోయిందీ వివరించాడట కుమారస్వామి. తనకూ, తన పార్టీకి ఓటములు కొత్త కాదు అని.. అనేక మార్లు ఓడిపోయినట్టుగా చెప్పారట కుమారస్వామి. అయితే ఇప్పుడు తను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు చేశారట.
ఈ సారి కూడా టుంకూరు నుంచి పోటీ చేసి తన తండ్రి దేవేగౌడ ఎంపీగా ఓడిపోయారని - ఓటమికి ఎవరూ కుంగిపోకూడదని కుమారస్వామి రాహుల్ కు హితబోధ చేశారట. మొత్తానికి తమ ఫెయిల్యూర్ స్టోరీలను వివరించి, ప్రతి ఒక్కరికీ టైమొస్తుందని - వేచి చూడాలని రాహుల్ గాంధీకి బాగానే చెప్పినట్టున్నాడు కుమారస్వామి.