ఎంత పిల్లి అయితే మాత్రం గదిలో వేసి అదే పనిగా కొడితే పులిలా మారుతుందన్న మాట చిన్నప్పటి నుంచి విన్నదే. ఇంచుమించు అలాంటి పరిస్థితే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిది. భారీగా సీట్లు లేకున్నా.. సుడి తిరిగిపోయి సీఎంగా మారిన కుమారస్వామి.. పదవి చేపట్టిన నాటి నుంచి ఆయనకు ఎదురవుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు.
వైరిపక్షం బీజేపీ వేస్తున్న వ్యూహాలు.. మిత్రపక్షమైన కాంగ్రెస్ చేస్తున్న అవమానాలకు కుమారస్వామి విసిగిపోతున్నారు. అదే పనిగా భావోద్వేగానికి గురి అవుతున్న ఆయన తాజాగా కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు అదే పనిగా లైన్ దాటుతున్నారని.. ఇదే తీరు కొనసాగితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని తేల్చేశారు. తాను మొదట్నించి గమనిస్తున్నానని.. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటే తీరు ఈ మధ్యన ఎక్కువైందన్న ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.
తమ నాయకుడు సిద్దరామయ్య అని.. ఆయనే సీఎం కావాలని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కుమారస్వామి స్పందించారు. తనకు సంబంధం లేని విషయమే అయినా.. ఇలానే వారు చేస్తుంటే తన పదవికి రాజీనామా చేస్తానని.. హద్దులు దాటుతున్న కాంగ్రెస్ నేతల్ని.. పార్టీ ఎమ్మెల్యేల్ని అదుపు చేయాలని ఆయన కోరుతున్నారు. కీలకమైన సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. ఢిల్లీ పీఠం దక్కటానికి ఏం చేయాలన్న అంశంపై దృష్టి సారించటం మానేసి.. కుమారస్వామిని కూర్చోనివ్వకుండా.. నిలుచోనివ్వకుండా చేస్తున్నకాంగ్రెస్ నేతల్ని అధినాయకత్వం కట్టడి చేయాలని కోరుతున్నారు. లేకుంటే.. రాబోయే అధికారం తర్వాత ఇప్పుడు చేతిలో ఉన్న పవర్ పోవటం ఖాయమంటున్నారు. మరి.. కుమారస్వామి కోపాన్ని రాహుల్ సాబ్ సీరియస్ గా తీసుకొని కర్ణాటక ఇష్యూను సెట్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.