చాలామంది మర్చిపోవచ్చు కానీ నరేంద్ర మోడీని దారుణంగా తిట్టిన రికార్డు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంతంగా చెప్పాలి. మోడీ.. మోడీ.. అంటూ యావత్ దేశం ఊగిపోయిన 2014 ఎన్నికల వేళలో.. మోడీని ఫాసిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్య చేసిన దమ్ము.. ధైర్యం కేసీఆర్ సొంతం. ఈ మాటను వాడినందుకే.. ఎన్నికల తర్వాత సుదీర్ఘకాలం కేసీఆర్ కు ప్రధాని హోదాలో మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెబుతారు.
తర్వాత వారిద్దరి మధ్య బంధం బలపడటం ఎలా ఉన్నా.. మొదట్లో మోడీని ఉద్దేశించి మొహమాటం లేకుండా ఘాటు విమర్శలు చేయటం మాత్రం కేసీఆర్ కే సాధ్యమైందని చెప్పాలి. నాటి నుంచి నేటి వరకూ మోడీని ఎంతో మంది ఆడిపోసుకున్నా.. తీవ్రమైన పదజాలంతో చురుకు పుట్టేలా తిట్టిన వైనం కనిపించదు.
తాజాగా ఆ లోటు తీరిపోయింది. ఐదేళ్ల క్రితం కేసీఆర్ చేసిన ఘాటు విమర్శకు మించిన రీతిలో తాజాగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చూస్తే.. మోడీని ఇంత దారుణంగా తిట్టిన నేత ఎవరూ కనిపించరు.
ప్రధాని మోడీ నియంత హిట్లర్ కంటే నికృష్టుడంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు. ఆయనో నియంత.. వ్యక్తుల వ్యక్తిగత ఆస్తులను లాక్కోవటానికి బిల్లు తెచ్చిన అథమ ప్రధాని అంటూ విరుచుకుపడ్డారు. రాజకీయ కక్షతో విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. మండ్య.. మైసూరు.. హాసన్ ల కాంట్రాక్టర్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? వేరే జిల్లాల్లో కాంట్రాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు. కుమారస్వామి పార్టీకి పట్టున్న ప్రాంతాలు మండ్య.. మైసూర్.. హాసన్ లు కావటం గమనార్హం.