కుష్భూ.. నగ్మాలకు మొండి‘చేయి’ మిగిలింది

Update: 2016-04-23 10:12 GMT
తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. వెండితెర మీద ఒక మెరుపులా మెరిసి.. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న సీనియర్ నటీమణులకు ఊహించని షాక్ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద పోటీకి దిగాలని విపరీతంగా ప్రయత్నించిన ఇద్దరు భామల్ని కాదని కాంగ్రెస్ అధినాయకత్వం మూడో వ్యక్తికి ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది.

ఒకప్పటి వెండితెర వేల్పులైన ఖుష్బూ.. నగ్మాలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగాలని విపరీతంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద పోటీకి వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా తాము పోటీ చేయాలని భావించిన మైలాపూర్ స్థానం కోసం ఈ ఇద్దరు విపరీతంగా ప్రయత్నాలు చేశారు.

ఖుష్భూ అయితే మిత్రపక్ష నేతగా.. డీఎంకే అధినేత కరుణానిధిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకొని.. జయలలిత మీద పోటీ చేయాలని భావించారు. ఇదే స్థానం నుంచి నటి నగ్మా సైతం బరిలోకి దిగాలని విపరీతంగా ప్రయత్నించారు. అయితే.. అనూహ్యంగా ఇద్దరు భామలకు మొండి చేయి చూపించిన అధినాయకత్వం వారిద్దరిని పోటీకి దూరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అమ్మ మీద పోటీ తర్వాత సంగతి.. కనీసం పోటీ చేయటానికి టిక్కెట్టు కూడా రాకపోవటంపై వారిరువురూ కారాలు మిరియాలు నూరుతున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News