సీనియర్ నటి కమ్ పొలిటికల్ లీడర్ కుష్భూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి తనదైన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. మనసులోని మాటను యథాతధంగా చెప్పేయటం.. వివాదాలకు వెరవకపోవటం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనటం.. బలంగా నిలవటం ఆమె బలాలుగా చెబుతారు. తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపినా.. తన మాట నుంచి పక్కకు రాని తత్త్వం ఆమెలో కనిపిస్తుంది.
ఆ మధ్యన ఆమె స్త్రీల కన్యత్వం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. పలువురు ఆగ్రహానికి గురయ్యారు. అయినప్పటికీ కుష్బూ తానేం చెప్పిందో దానికే కట్టుబడి ఉంది తప్పించి.. వెనక్కి ఒక్క అడుగు వేయటం కనిపించదు. దీంతో.. ఆమె ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై సేలంకు చెందిన పాట్టాలి మక్కల్ కట్చి తరపు లాయర్ మురుగన్ మేటూర్ కోర్టులో కుష్బూపై పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమె మేటూర్ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లారు.
ఆమె వాహనంపై టమోటాలు.. కోడిగుడ్లతో కొందరు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఖండిస్తూ మేటూరు తహసీల్దారు.. ఫిరోజ్ ఖాన్ పాట్టాలి మక్కుల్ కట్చి తీరును.. వారి కార్యకర్తల చర్యల్ని తప్పు పట్టారు. కుష్బూ వాహనంపై దాడిపై 41 మందిపై ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా.. కోర్టుకు హాజరైన కుష్భూ ను కోర్టు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాల్ని తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కుష్భూ కారుపై దాడికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది.