తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్టైల్ కాస్త వేరుగా ఉంటుంది. ఆయన ఎవరినైనా టార్గెట్ చేస్తే.. దాని వ్యవహారం పూర్తయ్యే వరకూ అస్సలు వదిలిపెట్టరు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను ‘కారు’లో ఎక్కించే విషయంలో ఆయన తీరు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కానీ.. సిట్టింగ్ పెట్టారంటే.. ఎంత పెద్ద నేత అయినా హరీశ్ మాటకు కన్వీన్స్ కావాల్సిందే. టీఆర్ ఎస్ మీద ఇప్పుడు రంకెలు వేస్తున్న కాంగ్రెస్ నేత.. మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యవహారంలోకి వస్తే.. హరీశ్ సిట్టింగ్ తర్వాత కారు ఎక్కేందుకు ఆయన ఓకే చెప్పారని.. అయితే.. కేసీఆర్ బ్రేకులు వేయటంతో ఈ వ్యవహారం ఆగిపోయిందని చెబుతారు.
ఇలా.. నేత ఎవరైనా సరే.. హరీశ్ సిట్టింగ్ వేశారంటే.. టార్గెట్ క్లోజ్ కావాల్సిందే. అలాంటిది అందుకు భిన్నమైన అనుభవం తాజాగా హరీశ్ కు ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని విపక్ష ఎమ్మెల్యేలపై స్పెషల్ ఫోకస్ చేసిన తెలంగాణ అధికారపక్షం.. అన్నీ రకాల అస్త్రాల్ని ప్రయోగిస్తూ.. తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించటం.. అందులో సఫలం కావటం తెలిసిందే.
తాజాగా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన వివేక్ పైనా ఫోకస్ చేశారు. ఆయన్ను కారు ఎక్కించటం ద్వారా.. నగరంలో తమ పట్టు పెరుగుతుందని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా టార్గెట్ క్లోజ్ చేసేందుకు వివేక్ తో హరీశ్ సిట్టింగ్ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. అందరూ ఒకేలా ఉండరన్నట్లుగా హరీశ్ తో సిట్టింగ్ లో కూర్చున్న వివేక్.. తాను నొవ్వక.. అలా అని హరీశ్ ను నొప్పించక.. ఆచితూచి మాట్లాడి తాను కారు ఎక్కలేనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
తాను సిట్టింగ్ వేసిన తర్వాత టార్గెట్ పూర్తి కాకపోవటం అన్నది ఉండదని వివేక్ ను ఉద్దేశించి హరీశ్ వ్యాఖ్యానిస్తే.. తనకు వ్యక్తిగతంగా హరీశ్ అంటే ఎంతో అభిమానమని.. కాకుంటే పార్టీ మారే విషయంలో తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని తేల్చినట్లు చెబుతున్నారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు చెప్పండి.. తప్పనిసరిగా మీకు సహకరిస్తానని చెప్పిన వివేక్.. హరీశ్ కు నిరాశే మిగిల్చాడు. దాదాపు రెండు గంటల పాటు సాగినట్లుగా చెబుతున్న ఈ సిట్టింగ్ హరీశ్ కు ఎప్పుడూ ఎదురుకాని అనుభవం ఎదురైందని చెబుతున్నారు.