ఏ క్షణంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ట్రంప్ డిసైడ్ అయ్యారో కానీ.. ప్రపంచం వ్యాప్తంగా చిత్రవిచిత్రమైన పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. తన మాటతో..చేష్టలతో ఇప్పటికే పెనుసంచలనాలను సృష్టించిన ట్రంప్.. అమెరికా అధ్యక్ష హోదాలో ముస్లిం మెజార్టీలున్న ఏడు దేశాలపై నిషేధం విధిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ బాటనే పట్టింది కువైట్.
అమెరికా మాదిరే ఈ దేశం తాజాగా ఐదు దేశాలపై బ్యాన్ విధించింది. సిరియా.. ఇరాక్.. అఫ్గనిస్తాన్.. ఇరాన్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన వారిని తమ దేశంలోకి రానివ్వమంటూ తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ఐదు దేశాలకు చెందినప్రయాణికులకు వీసాల్నిజారీ చేయటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఐదు దేశాలతో టూరిజం.. ట్రేడ్.. విజిటర్ వీసాల్ని కూడా కఠినతరం చేయనున్నట్లుగా వెల్లడించింది.
ఈ దేశాలకు చెందిన వలసవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశానికి వచ్చేందుకు వీసాల కోసం అప్లికేషన్లు పెట్టుకోవద్దని తేల్చిచెప్పేసింది. కువైట్ నగరం రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదుల ముప్పుతో తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో ఐదు దేశాలపై బ్యాన్ విధిస్తున్నట్లు వెల్లడించింది. ఓపక్క ట్రంప్ తీసుకున్న బ్యాన్ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కువైట్ కూడా ఆయన బాటలో నడవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/