గల్ఫ్ దేశాల్లోని కఠిన చట్టాలు ఎంత పకడ్బందీగా అమలవుతాయో తెలియజేసేందుకు మరో ఉదాహరణ ఇది. కువైట్ యువరాజు షేక్ ఫైసల్ అబ్దుల్లా అల్ సాబాను ఆ దేశ అధికారులు ఉరి తీశారు. ఏడేళ్ల క్రితం ప్రిన్స్ అబ్దుల్లా మరో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిని హత్య చేశాడు. ఆ హత్య కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతం ప్రిన్స్ అబ్దుల్లాను అరెస్టు చేసి బుధవారం ఉరి తీశారు. ప్రిన్స్‌తో పాటు మరో ఆరుగురికి కూడా ఉరిని అమలు చేసింది కువైట్ దేశం. గల్ఫ్ దేశాల్లో ఓ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఉరి తీయడం ఇదే మొదటిసారి.
2013 తరువాత కువైట్ లో ఉరిశిక్ష అమలుచేయటం ఇదే తొలిసారి. ఉరితీయబడిన వారిలో ఇద్దరు కువైటీలు - ఇద్దరు ఈజిప్షియన్లు - బంగ్లాదేశ్ - ఫిలిప్పైన్స్ - ఇథియోపియాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని అధికార కునా వార్తా సంస్థ వెల్లడించింది. కాగా గల్ఫ్ దేశాల్లో అనేక రాజ కుటుంబాలు ఉంటాయి. వారికి సైతం పెద్ద సంఖ్యలో సంతానం ఉంటుంది. అలాంటి వారిలోనే అల్ సాబా ఒకరు. అయితే రాజ కుటుంబం అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షల విషయంలో ఎలాంటి మినహాయింపులు వర్తించవు. దానికి తాజా ఉరిశిక్షే ఉదాహరణ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/