చంద్రబాబుకు నంది.. మోదీకి ఆస్కార్ అవార్డు

Update: 2018-03-14 17:18 GMT
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సమయం దొరికినప్పుడంతా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్లేస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబు - మోదీల తీరుపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతోందని - సీఎం చంద్రబాబునాయుడు - ప్రధాని నరేంద్ర మోదీలు తమ నటనతో రాష్ట్ర  ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
        
నంది అవార్డు స్థాయి నటనతో చంద్రబాబు - ఆస్కార్ అవార్డు స్థాయి నటనను మోదీ ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఏపీ ప్రయోజనాలను కాలరాసేలా చంద్రబాబు - మోదీ వ్యవహరిస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు కావాలని ఇన్నేళ్లుగా కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఏపీకి తాము ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పమని కేంద్రం అడుగుతున్నందువల్లే బీజేపీని టీడీపీ వ్యతిరేకిస్తోందని కేవీపీ విమర్శించారు.
    
కాగా కేవీపీ ఆరోపణలు అక్షర సత్యాలని ఇతర కాంగ్రెస్ నేతలూ అంటున్నారు. కేంద్రం అరకొరగా ఇచ్చిన నిధులకు కూడా రాష్ట్రం లెక్కలు చెప్పలేదని.. దీంత అవేమయ్యాయని మోదీ ప్రభుత్వం నిలదీసి అడుగుతుండేసరికి.. చంద్రబాబు అప్పుడెప్పుడో పక్కన పెట్టేసిన ప్రత్యేక హోదా నినాదాన్ని మళ్లీ ఎత్తుకున్నారని.. అంతేకానీ.. ఆయనకు దీనిపై చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News