తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ ఆసక్తికరమైన విషయం చెప్పారు. కొత్త జిల్లాలు - రెవెన్యూ డివిజన్లు - మండలాల ఏర్పాటు ఏవిధంగా ఉన్నాయనే సందర్భాన్ని రమణ ఉదహరిస్తూ కేసీఆర్ కు ఒక బొమ్మ ఇస్తే చాలు పని అయిపోతుందని చెప్పారు! అదిలాబాద్ జిల్లాలో ఒక పులి రెండు పిల్లల్ని కంటే అక్కడ ఎమ్మెల్యే వాటిని ఫొటో తీసి ముఖ్యమంత్రికి ఇస్తే ఖుషీ అయ్యారని రమణ చెప్పారు. ఆ తర్వాత సదరు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రెండు మండలాలు కావాలంటే కేసీఆర్ వెంటనే జీవో ఇచ్చేశారని రమణ ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలు - రెవెన్యూ డివిజన్లు - మండలాల ఏర్పాటు ఏవిధంగా ఉన్నాయన్నదానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమేనని రమణ వ్యాఖ్యానించారు.
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని - 24 జిల్లాలుగా చేయాలనే ఆలోచన ఉందని టీఆర్ ఎస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేపథ్యంలో దాన్ని నిలుపుకొంటున్న కేసీఆర్ చెప్పడం అబద్దమని రమణ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కొత్త జిల్లాల ప్రతిపాదన ఏమైందని ప్రభుత్వాన్ని అడుగగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన అసెంబ్లీ సీట్ల పెరిగిన తరువాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుందామని తొందరేముందని చెప్పారని రమణ గుర్తుచేశారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయకపోవడం వల్ల జరుగుతున్న ఆందోళనలు - ఎంసెట్ లీకేజీ వల్ల వేల మంది విద్యార్థులు నష్టపోవడం, కరువు వల్ల రైతులు నష్టపోవడం వంటి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఫాంహౌస్ కేసీఆర్ కొత్త జిల్లాల ఆలోచన చేసి ముందుకు తెచ్చారని మండిపడ్డరాఉ. ప్రధాన కార్యదర్శితో కమిటీ - కేబినెట్ సబ్ కమిటీ - అఖిలపక్షం అని - ఇప్పుడు హైపవర్ కమిటీ అంటున్నారని.... ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సింది పోయి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని రమణ మండిపడ్డారు. గ్రామాలు - మండలాలు - జిల్లాల మధ్య చిచ్చు పెట్టి కుక్కలు చింపిన అఖిలపక్షంలో ప్రజలకు అనుగుణంగా వెళ్తామని, జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలు మళ్లీ అందరితో చర్చించి అందరి ఆమోదంతో చేద్దామన్న కేసీఆర్ ఆ మాటలను గాలికి ఒదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనతో దేశవ్యాప్తంగా తెలంగాణ అపహాస్యం పాలవుతోందని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ సొంత నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయని రమణ తప్పుపట్టారు. నారాయణ పేట జిల్లాను ప్రజలు అడుగుతున్నారని తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని అన్నారు. కేసీఆర్ తీరువల్ల జిల్లాలకు ఉన్న పవిత్రత పోతున్నదని కేవలం కేసీఆర్ కుటుంబమే ఉండాలన్న దుర్బుద్ధితో చేస్తున్నార మండిపడ్డారు. 2019 ఎన్నికలలో రాజకీయ పార్టీలను బలహీన పరచాలని చేస్తున్న ఈ ఎత్తుగడ ఫలించదని రమణ చెప్పారు. రూ. 68 వేల కోట్ల అప్పును రూ. లక్షా 30 వేల కోట్లకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్రాన్ని దివాలా వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/