ఎల్వీ సుబ్రహ్మణ్యం... పేరు వింటేనే నుదుటన పెద్ద బొట్టుతో సనాతన హిందువుగా, వినయ విధేయతలతో కూడిన ముఖంతో జీ హుజూర్ అంటూ నిలబడే అధికారి మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. దేశ అత్యున్నత సర్వీసు ఐఏఎస్ కు ఎంపికైన నాటి నుంచి మొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బాధగా దిగిపోయే దాకా... ప్రతి సందర్భంలోనూ ఎల్వీ వార్తల్లో వ్యక్తిగానే నిలిచారని చెప్పాలి. తనకే సీనియారిటీ ఉన్నా... చంద్రబాబునాయుడు తనను సీఎస్ గా నియమించకున్నా కూడా పట్టించుకోని అధికారిగా కూడా ఎల్వీ మనందరికీ తెలిసినవారే. చూడ్డానికి జీ హుజూర్ అంటూ నిలుచున్న అధికారి లానే కనిపించే ఎల్వీ... విధి నిర్వహణలో మాత్రం చండశాసనుడనే పేరుంది. అంతేకాకుండా అసంబద్ధ నిర్ణయాలు తీసుకునే పాలకులకు కళ్లె వేసే విషయంలోనూ ఎల్వీ ఏమాత్రం వెనుకంజ వేయరని ఇటీవలి పరిణామాలు మనకు చెబుతున్నాయి.
సరే... ఏపీ సీఎస్ పదవి నుంచి ఇటీవలే బదిలీ అయిపోయి ఎక్కడా కనిపించకుడా తన పనేదో తాను చూసుకుంటున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏమిటంటే... ఓ మూడు నెలల క్రితం ఏపీ పాలనకు బాస్ గా, రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు బాస్ గా వ్యవహరించిన ఎల్వీ... ఇప్పుడు కేవలం ఒక్కరంటే ఒక్క అటెండర్ తో కాలక్షేపం చేస్తున్నారట. అది కూడా ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే సుమా. ప్రభుత్వ కార్యాలయం అంటే... సివిల్ సర్వీసెస్ లో అత్యున్నత ర్యాంకు చేరుకున్న ఓ సీనియుర్ ఐఏఎస్ పనిచేస్తున్న కార్యాలయంలో సింగిల్ అటెండర్ మినహా ఒక్క ఉద్యోగి కూడా లేరా? అంటే... లేరేనన్న సమాధానం వినిపిస్తోంది. అంటే... మొన్నటిదాకా లక్షకు పైగా మంది సిబ్బంది... నిత్యం రద్దీతో సాగే సెక్రటేరియట్ కే బాస్ గా సాగినయ ఎల్వీ... ఇప్పుడు ఓ అటెండర్ తో కాలక్షేపం చేస్తున్నారంటే ఆశ్చర్యమే కదా.
సరే మరి... ఎల్వీ గారి ప్రస్తుత పరిస్థితి ఏమిటో చూద్దాం పదండి. సీఎస్ పదవి నపుంచి బదిలీ అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఎల్వీ అక్కడ అడుగుపెట్టే సమయానికి అక్కడ ఒకే ఒక్క అటెండర్ మాత్రమే పనిచేస్తున్నారట. అదెలాగంటే... మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మొన్నటిదాకా పనిచేసిన ఉద్యోగులంతా ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన వారేనట. జగన్ సీఎం అయ్యాక అక్కడి వారితో పాటు రాష్ట్రంలోని మెజారిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు కదా. అలా అందరూ వెళ్లిపోతే... శాశ్వత ప్రాతిపదిన నియమితులైన ఒకే ఒక్క అటెండర్ మాత్రమే అక్కడ మిగిలారట. సో... ఆ ఒక్క అటెండర్ తోనే ఎల్వీ అలా సైలెంట్ గా పనిచేసుకుపోతున్నారట. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య తాజాగా ప్రస్తావించారు.