కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. దేశంలోని ఫ్రంట్ లైన్ కార్మికులు, వైద్యులు, వైద్య సిబ్బందికి మొదటి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో కూడా కరోనా వ్యాక్సినేషన్ చురుకుగా కొనసాగుతోందితాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన యువ డాక్టర్ ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒంగోలు జీజీహెచ్ తోపాటు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మీ ని చెన్నై తరలించారు.
ఒంగోలు జీజీహెచ్ లో డాక్టర్ గా పనిచేస్తున్న ఆమె ఈనెల 23న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే 24 నుంచి డాక్టర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జీజీహెచ్ లో ఆమెకు చికిత్స అందించారు. కానీ జ్వరం ఎక్కువ కావడంతోపాటు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయింది.వెంటనే అప్రమత్తమైన జీజీహెచ్ వైద్యులు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రి సంఘమిత్రకు తరలించారు. అయితే అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.