కడుపులో 51 చిన్ని సంచీల్లో డ్రగ్స్ దాచుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయిన దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ మూసా ఉదంతం తెలిసిందే. దాదాపు 600గ్రామాలున్న డ్రగ్స్ ను పొట్టలో పెట్టుకొని వచ్చిన ఆమె నడకలో తేడాను గుర్తించిన పోలీసులు ఆమెను విచారించి.. కడుపు గుట్టును రట్టు చేయటం తెలిసిందే.
ఏ అండతో అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారన్న కోణంలో విచారిస్తున్న పోలీసులకు ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. మూసా వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ల హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌కు మూసా రావటం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ ఆమె వచ్చిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.
ఇక.. ఆమె కడుపులో దాచుకొని వచ్చిన డ్రగ్స్ విలువ సుమారు రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారంలో ముంబయికి చెందిన డ్రగ్స్ లేడీ డాన్ హస్తం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మూసాను హైదరాబాద్‌కు పంపటంలో ముంబయి లేడీ డాన్ శశికళ పాత్ర పక్కా అని చెబుతున్నారు. ఏటా దాదాపు రూ.100కోట్ల వరకు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తుందన్న అంచనాలున్న ఆమె వెనుక ఉండి మూసాను హైదరాబాద్ పంపినట్లుగా భావిస్తున్నారు. మరింత భారీ మొత్తంలో సాగుతున్న డ్రగ్ మాఫియా అడ్డుకట్ట వేసే వారే లేరా..?