అనుమానించిందే నిజమైంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నోటి నుంచి శపధాలు వస్తే.. అవి కచ్ఛితంగా జరగవన్న సెంటిమెంట్ మరోసారి ఫ్రూవ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తాను రాజకీయాల నుంచి సన్యసిస్తానని చెప్పిన ఆయన.. తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోకాంగ్రెస్ మహా కూటమి విజయం సాధిస్తుందని.. టీఆర్ ఎస్ ఓటమి పాలవుతుందన్న ఆయన ఎగ్జిట్ పోల్స్ దారుణంగా ఫెయిల్ కావటమే కాదు.. ఆయన సర్వేలకు ఉన్న ఇమేజ్ మొత్తం దెబ్బ తింది. ఈ సందర్భంగా ఆయనపై పలు విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను శనివారం సాయంత్రం సూచన ప్రాయంగా వెల్లడించిన లగడపాటి..ఆదివారం సాయంత్రం మాత్రం క్లియర్ గా టీడీపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు.. తాను చెప్పినట్లుగా ఎగ్జిట్ పోల్స్ నిజం కాని పక్షంలో రానున్న రోజుల్లో తానిక ఎగ్జిట్ పోల్స్ చేయనని.. ఏ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వివరాల్ని వెల్లడించని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఇదే తరహాలో శపధం చేసి.. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం కావటం తెలిసిందే.
తాజాగా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ చారిత్రక విజయం దిశగా దూసుకెళుతున్న వేళ.. లగడపాటి శపధానికి తగ్గట్లు ఇకపై ఆయన ఎగ్జిట్ పోల్స్ అంచనాకు దూరం కావటం ఖాయమని చెప్పకతప్పదు. మనకు అచ్చిరాని శపధాలు చేసి.. అన్నింటిని దూరం చేసుకోవటంలో అర్థం లేదు లగడపాటి.