ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు ప్రత్యక్ష రాజకీయాలపై ఆశలు ఇంకా చావలేదన్న వార్తలు మరోమారు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజల ఇష్టానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని - అందుకు నిరసనగా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా గడచిన ఎన్నికలకు ముందు ప్రకటించిన లగడపాటి... అందుకనుగుణంగానే గడచిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే పేరిట సొంతంగా ఏర్పాటు చేసుకున్న సర్వే బృందం ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ... మెయిన్ స్ట్రీమ్ లోనే కనిపిస్తున్న లగడపాటి... మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తప్పుడు సర్వేలు ఇచ్చి క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టేసుకున్నారు. అంతేకాకుండా పలుమార్లు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పలుమార్లు భేటీ అయిన లగడపాటి... తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఇంకా మక్కువ చావలేదని కూడా చెప్పేసుకున్నారు.
అయితే ఎప్పటికప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ చెబుతూ వస్తున్న లగడపాటి... మొన్న కూడా ఇదే మాట పలికారు. అయితే ఆయన చేపట్టే చర్యలు ప్రతి ఒక్కటీ ఆయన మనసులోని మాటను బయటపెడుతూనే ఉన్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తనదైన శైలిలో పావులు కదుపుతూ వస్తున్న లగడపాటి... నేడు మరో కీలక వ్యక్తితో భేటీ అయి మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. నేటి ఉదయం గుంటూరు వెళ్లిన లగడపాటి... అక్కడ టీడీపీ సీనియర్ నేత - ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో భేటీ అయ్యారు. గుంటూరులోని హీరో హోండా షోరూంలో భేటీ అయిన వీరిద్దరూ చాలా సేపు అత్యంత రహస్యంగా చర్చలు జరిపినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఎలాగూ ఖాళీ లేని నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని లగడపాటి భావిస్తున్నారట.
ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబుతో చెప్పేంత చనువు ఉన్నా... తన నోటితో కాకుండా చంద్రబాబు ఎవరి మాట అయితే వింటారో వారితో చెప్పించేలా ప్లాన్ చేసినట్లుగా సమాచారం. పార్టీలో సీనియర్ నేతగా కోడెలకు చంద్రబాబు వద్ద మంచి వెయిటేజీ ఉంది. ఈ క్రమంలో తన మనసులో మాటను కోడెలకు చెప్పి... కోడెల చేతే చంద్రబాబుకు చెప్పించేలా లగడపాటి ప్లాన్ చేసినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇందుకోసమే గుంటూరు వెళ్లిన లగడపాటి కోడెలను అత్యంత రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. కోడెలను డైరెక్ట్‌గా ఆయన నివాసంలోనూ కలిసే వీలున్నా... ఎక్కడ ఈ భేటీ గురించి బయటకు తెలుస్తుందోనన్న భయంతోనే లగడపాటి హీరో హోండా షోరూంలో కోడెలతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది.