ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. వివిధ వర్గాల ప్రచారం ప్రకారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో జరిగిన ఈ భేటీలో ఏకాంతంగా 45 నిమిషాల పాటు జగన్ తో లగడపాటి మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో లగడపాటి వైసీపీలో చేరడం, ఆయనకు టికెట్ కేటాయించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మైలవరం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ బరిలో దిగుతారని కూడా అంచనాలు వెలువడుతుండటం గమనార్హం.
2019 ఎన్నికల్లో ఇప్పటికే దాదాపుగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పొట్లూరి ఖరారు అయిన విషయము తెలిసిందే ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా లేకపోవటంతో లగడపాటి మైలవరం సీటు పై ఆసక్తి చూపగా అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మంచి ముహూర్తం చూసుకొని విజయవాడలో భారీ బహిరంగ నిర్వహించి జగన్ సమక్షంలో పార్టీ లో చేరేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడుతోంది. కాగా, ఇటీవల ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని లగడపాటి విశ్లేషించారు. కొద్దికాలంగా ఆ పార్టీ ఒకింత బలోపేతం అయిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అధికార టీడీపీ, వైసీపీలకు సమాన శాతం మద్దతు ఉందని విశ్లేషించారు. గతంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కనుమరుగైందని లగడపాటి వివరించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక తన రాజకీయ భవిష్యత్ పై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు లగడపాటి ప్రకటించారు. అయితే ఆయన జగన్ తో భేటీ అయినట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/