తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నాటి బెజవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎంతగా ఫైర్ అయ్యేవారో తెలిసిందే. లగడపాటి వ్యాఖ్యలకు ధీటుగా కేసీఆర్ బదులిచ్చేవారు కూడా. ఇలా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసుకున్నది గతం. వర్తమానానికి వస్తే.. ఉద్యమనాయకుడిగా.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని ఆవిష్కరించేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా తప్పు పట్టిన లగడపాటి తాజాగా ఆయన్ను విపరీతంగా పొగిడేశారు.
మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డితో కలిసి తాజాగా యాదాద్రి వెళ్లిన లగడపాటి.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్ని విపరీతంగా మెచ్చుకున్నారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చటానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమన్నారు. ఈ ఆలయానికి విశేష పేరుప్రఖ్యాతులు తెచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని మెచ్చుకున్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు.
ఇప్పటివరకూ యాదాద్రి అభివృద్ధి పనుల గురించి మీడియాలో చూశానని.. తాజాగా మాత్రం ప్రత్యక్షంగా చూశానని.. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో తాను ఒకసారి వచ్చానని.. అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించి.. విభేదించిన కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారంటూ లగడపాటి పొగిడేయటం విశేషంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/