దేశంలో ఎన్ని ప్రామాణిక సర్వేలు ఉన్నా... తెలుగు వాడైన లగడపాటి సర్వేకు విశ్వసనీయత ఎక్కువ. ఇంతకాలం ఆయన సర్వేలు చెప్పిన నిజం కావడం ఈ విశ్వసనీయతకు కారణం. ఏపీ తెలంగాణ అయినా ఇతర రాష్ట్రాలు అయినా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరికి బలం పెరిగిందో, ఎవరికి మద్దతు తగ్గుతుందో కచ్చితంగా చెప్పగలగడం లగడపాటి ప్రత్యేకత. తాజాగా ఐదు రాష్ర్టాల ఎన్నికలపై ఆయన సర్వే చేయించి.. ఆ వివరాలు వెల్లడించారు.
ఢిల్లీకి దగ్గరి దారి అని పేరున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత పోరులో భారతీయ జనతా పార్టీ గెలుపు సాధిస్తుందని పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని లగడపాటి అభిప్రాయపడ్డారు. యూపీ ప్రజలు పెద్ద నోట్ల రద్దును స్వాగతించడం వల్ల ఎన్నికల్లో విజయానికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. అధికార ఎస్పీలో ఉన్న కుటుంబ కలహాలు - బీఎస్పీ - కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేకపోవడం ఇందుకు కారణమని లగడపాటి విశ్లేషించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ అధికారంపై కన్నేసిన బీజేపీ చివరకు తన లక్ష్యాన్ని చేరుకునే రోజు దగ్గర పడిందన్నారు.
ఇక ఏపీ రాజకీయాల గురించి కూడా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. తన మధ్యంతర సర్వే అంచనాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బల పడగా - అధికార తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోందన్నారు. స్థానిక తెలుగు దేశం నాయకుల వ్యవహార శైలి ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల మందగమనం వీటికి కారణంగా లగడపాటి చెప్పుకొచ్చారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అధికార టీడీపీ - వైసీపీలకు సమాన మద్దతు ఉందని విశ్లేషించారు. గతంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కనుమరుగైందని లగడపాటి వివరించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక తన రాజకీయ భవిష్యత్ పై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తాను రాజకీయాలకు, తెలుగు రాష్ట్రాలకూ దూరంగా ఉన్నట్లు లగడపాటి ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/