లగడపాటి చంద్రబాబును కలిసింది అందుకా?

Update: 2017-05-02 14:08 GMT
ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఈ మధ్య వార్తల్లో ఉండట్లేదు. ఐతే ఇటీవలే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం చర్చనీయాంశం అయింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కొందరేమో లగడపాటి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తాడని అన్నారు. ఇంకొందరు తన లాంకో కొండపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకు బాబును కలిశాడన్నారు. మరికొందరేమో ఆర్థిక సంక్షోభంలో ఉన్న లాంకో గ్రూపును బయటపడేసేందుకు చంద్రబాబు సాయం కోరడానికి లగడపాటి ప్రయత్నం చేస్తున్నట్లుగా మాట్లాడారు.

ఐతే లగడపాటి చంద్రబాబును కలవడంలో అసలు కథ వేరే అని సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కారు పనితీరుపై.. తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై తన టీం ద్వారా సర్వే రహస్య సర్వే నిర్వహించిన లగడపాటి.. దాని గురించి నివేదిక ఇవ్వడానికే చంద్రబాబును కలిశారట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయావకాశాలపై తన సర్వే ఫలితాల్ని చంద్రబాబు ముందు పెట్టారని సమాచారం. ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుపై అంత వ్యతిరేకతతో లేనప్పటికీ.. తెలుగుదేశం ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు ఈ సర్వేలో తేలినట్లు సమాచారం. మెజారిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు ఈ సర్వేలో తేలిందంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. అవినీతిలో మునిగి తేలుతున్నట్లు సర్వేలో తేలిందట. ప్రస్తతుం ఎమ్మెల్యేలు చాలామందికి టికెట్లు ఇవ్వడం అంత మంచిది కాదని లగడపాటి సూచించాడట. అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతం చేస్తే తప్ప అభివృద్ధి జనాలకు కనిపించదని కూడా లగడపాటి సూచించాడట. లగడపాటి సర్వేలకు విశ్వసనీయత ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News