ఎన్నికలు వస్తున్నాయంటే బోలెడన్ని సర్వేలు వచ్చేస్తుంటాయి. మీడియా సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా కలిసి సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఫలితాలు ప్రకటిస్తుంటాయి. ఐతే అందరి సర్వేలూ వాస్తవికంగా అనిపించవు. కొన్ని సర్వేల్లో మాత్రమే కచ్చితత్వం కనిపిస్తుంది. ఫలితాలకు కూడా అవి దగ్గరగా కనిపిస్తాయి. మాజీ ఎంపీ లగడపాటి సర్వేలకు ఉన్న క్రెడిబిలిటీ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సర్వేలు ప్రతిసారీ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటుంటాయి. దీంతో జనం ఆయన సర్వేల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఐతే విస్తృతమైన నెట్ వర్క్ ఉన్న మీడియా సంస్థలకు లేని క్రెడిబిలిటీ ఈయనకు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఆ కచ్చితత్వం ఎలా వచ్చింది.. ఆయన టీం సర్వేల విషయంలో అనుసరించే విధానం ఏంటి అన్నది ఆసక్తికరం. తాజాగా లగడపాటి ఆ గుట్టు విప్పాడు. ఆ విశేషాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘చాలా మంది ఎక్కువ మంది అభిప్రాయం తీసుకుంటే సర్వే సరిగ్గా వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. సర్వే శాంపిల్ పెద్దదా చిన్నదా అన్నది ప్రధానం కాదు. మనం సర్వే కోసం ఎంచుకునే మనుషులు ఎవరన్నది అత్యంత కీకలం. ఒక ఐదు నియోజకవర్గాల్లో 50 మందిని అడిగి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితమేంటో చెప్పేయొచ్చు. ఆ 50 మందిని ఎన్నుకోవడంలోనే సర్వే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం కానీ.. ఎవరు గెలుస్తారో మాత్రం చెప్పేయొచ్చు. నేరుగా వ్యక్తులతో మాట్లాడి చేసే సర్వేలకే క్రెడిబిలిటీ ఉంటుంది. సెల్ ఫోన్ లతో చేసే సర్వేలు సరైన ఫలితాలు రావు. ఇటీవలే మా టీం కర్ణాటకలో సెల్ ఫోన్ సర్వేతో పాటు ఫీల్డ్ సర్వే కూడా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లో కూడా అలానే చేశాం. ఐతే రెంటి ఫలితాలూ భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఫోన్ సర్వే అనేది బోగస్ అని చెప్పొచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఓటర్లలో సైలెంట్ ఓటర్లు.. వోకల్ ఓటర్లు అని రెండు రకాలు ఉంటారు. సైలెంట్ ఓటర్ల నాడి పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ల వల్లే గత పర్యాయం తెలుగుదేశం గెలిచింది. వోకల్ ఓటర్ల అభిప్రాయాల్ని బట్టి అందరూ గత ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనుకున్నారు. కానీ ఫలితాన్ని నిర్దేశించింది సైలెంట్ ఓటర్లు. వీరి మనోగతం మారుతూ ఉంటుంది. వాళ్లు న్యూస్ ఛానెళ్లు చూడరు. వారి నాడి పట్టుకోవడం కష్టం. వారి పల్స్ పట్టుకోవడం సర్వేకు కీలకం. ఎన్నికలకు 10-15 రోజుల ముందు చేసే సర్వేలు కచ్చితంగా ఉంటే పబ్లిక్ పల్స్ ఎలా ఉందనేది తెలుస్తుంది’’ అని లగడపాటి అన్నాడు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి డిసెంబర్ 5 లోపు సర్వే ఫలితాలు తన వద్ద రెడీగా ఉంటాయని.. పోలింగ్ అయ్యాక వాటిని బయటపెడతానని ఆయన చెప్పారు.