లగడపాటి దెబ్బ గల్లాకా ? కేశినేనికా?

Update: 2017-06-11 06:43 GMT
రాష్ర్ట విభజన తరువాత రాజకీయాలను వదిలేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయ ప్రవేశానికి రెడీ అవుతున్నారు. అయితే, ఈసారి ఆయన తన పాత పార్టీ కాంగ్రెస్ లోకి కాకుండా టీడీపీలో చేరబోతున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం.
    
తాజాగా ఆయన విజయవాడలో శనివారం తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు.  ఈస‌మావేశంలో 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేస్తాన‌నే సంకేతాల‌ను ల‌గ‌డ‌పాటి ఇచ్చారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగితే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి శ‌ప‌థం చేశారు. అన్న‌ట్లుగానే ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఆ త‌ర్వాత రాజకీయాల‌కు కొంత‌కాలం దూరంగా ఉన్నారు. కానీ అప్పుడ‌ప్పుడు స‌ర్వేల పేరు చెబుతూ ఆయ‌న పేరిట లీకులు వ‌చ్చాయి. ఆత‌ర్వాత కొంత‌కాలం కింద‌ట చంద్ర‌బాబుని క‌లిశారు ల‌గ‌డ‌పాటి. ఈ సంద‌ర్భంగా ల‌గ‌డ‌పాటి టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారం న‌డిచింది. అయితే వ్యాపార ప‌నుల కోసం చంద్ర‌బాబుని క‌లిశార‌ని ఆ త‌ర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ల‌గ‌డ‌పాటి రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తార‌నే ప్ర‌చారం బెజ‌వాడ‌లో ఊపందుకుంది.
    
ఆయ‌న తెలుగుదేశంలో చేర‌తార‌ని అనుచ‌రులు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గం మాత్రం డిసైడ్ కాలేద‌ని చెబుతున్నారు. ల‌గ‌డ‌పాటి గుంటూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ పోటీ చేస్తారని భావిస్తున్నారు. మొత్తానికి ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీ ఇస్తే కేశినేని నాని లేదా గ‌ల్లా జ‌య‌దేవ్ సీటులో ఎవరికో ఒకరికి దెబ్బ పడడం ఖాయమని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News