గడిచిన వారంలో పలు సర్వేల పేరిట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయాన్ని సోషల్ మీడియా తేల్చి చెబుతున్న సంగతి తెలిసిందే. ఎవరు చేశారో వివరాలు వెల్లడించకుండా.. ఎవరికి వారు సర్వే రిపోర్టుల పేరుతో పెడుతున్న పోస్టుల కలకలం ఒక కొలిక్కి రాక ముందే తాజాగా ఒక ఆసక్తికరమైన సర్వే సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లలోనూ హడావుడి చేస్తుంది.
పొలిటికల్ సర్వేలు.. అందునా ఎన్నికల సందర్భంగా లగడపాటి పేరుతో వచ్చే సర్వేల మీద ఉండే విశ్వసనీయత అంతా ఇంతా కాదు. వివిధ ఛానళ్లు బోల్తా పడిన సందర్భాల్లోనూ లగడపాటి సర్వే మాత్రం తుది ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ఆయన చేయించిన సర్వే అంటే అందరిలోనూ ఒకింత ఆసక్తి.. మరింత ఉత్సుకత వ్యక్తమవుతోంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న సర్వే ఫలితం షాకింగ్ గా మారింది.
ఎందుకంటే.. ఈ సర్వే ప్రకారం కేసీఆర్ కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఓపక్క ఎన్నికలు ఎప్పుడు జరిగినా వంద సీట్లు పక్కా అని ఒకవైపు గులాబీ బాస్ బల్లగుద్ది చెబుతున్న పరిస్థితి. మరోవైపు.. విపక్ష కాంగ్రెస్ కు ఒక్కటంటే.. ఒక్క స్థానం దక్కనదంటూ తాజా మాజీ మంత్రులు పలువురు చేస్తున్న ప్రకటనలు అతిశయం హద్దులు దాటేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఇలాంటి వేళ మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ పేరుతో ఒక సర్వే హడావుడి చేస్తోంది. ఈ సర్వే ఫలితం ప్రకారం చూస్తే కేసీఆర్ జట్టు పక్కాగా ఓడిపోనున్నట్లుగా స్పష్టమవుతోంది. సోషల్ మీడియా.. వాట్సాప్ లలో హడావుడి చేస్తున్న ఈ సర్వేఫలితం నిజం కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. లగడపాటి సర్వే ఫలితాలు విడుదల చేసిన పక్షంలో ఆయన మీడియా ముందుకు రావటం.. తాను నిర్వహించిన సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయన్నది చెబుతుంటారు. కానీ.. తాజా ఉదంతంలో అలాంటిదేమీ లేదన్నది తెలిసిందే.
వైరల్ గా మారిన లగడపాటి సర్వే నిజం కాదని.. ఉత్తదే అన్నది చెప్పక తప్పదు. కేసీఆర్ వ్యతిరేకులు కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారంగా చెబుతున్నారు. తన పేరు మీద జరుగుతున్న సర్వే హడావుడిపై లగడపాటి ఒకసారి స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ పనేదో చేసేయొచ్చుగా లగడపాటి?