సంచ‌ల‌నం సృష్టిస్తున్న‌ ల‌గ‌డ‌పాటి లీక్స్

Update: 2018-12-05 08:19 GMT
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై లగ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మికి మొగ్గు ఉంద‌ని ఆయ‌న చెప్ప‌డంతో కేటీఆర్ మంగ‌ళ‌వారం రాత్రే కౌంట‌ర్ ఇచ్చారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే బూట‌క‌మ‌ని చెప్పారు. గ‌త నెల 20న త‌న‌తో ల‌గ‌డ‌పాటి చేసిన వాట్స‌ప్ చాట్ స్క్రీన్ షాట్‌ల‌ను ట్విట‌ర్ వేదిక‌గా బ‌య‌ట‌పెట్టారు. చంద్ర‌బాబు ఒత్తిడి వ‌ల్లే ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాల‌ను తారుమారు చేశార‌ని ఆరోపించారు.

కేటీఆర్ ట్వీట్ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి బుధ‌వారం తిరిగి స్పందించారు. చేదు ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని తేల‌డంతో కేటీఆర్ త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని అన్నారు. అందుకే త‌న ఆర్జీ ఫ్లాష్ స‌ర్వే బోగ‌స్ అని చెప్తున్న‌ట్లు పేర్కొన్నారు. కేటీఆర్ త‌న‌తో చేసిన వాట్స‌ప్ చాట్ వివ‌రాల‌ను కూడా లగడపాటి బయటపెట్టారు. కేటీఆర్ వాట్సాప్ నంబర్‌ను మీడియాకు చెప్పేశారు. 9490866666 నంబర్ నుంచి కేటీఆర్ తనతో వాట్సాప్‌లో చాటింగ్ చేశారని, 8096699999 నంబర్ నుంచి కూడా కాంటాక్ట్ అయ్యారని వెల్ల‌డించారు. సర్వే రిపోర్టులు పంపిచడానికి కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు.

త‌న స‌ర్వేపై కేటీఆర్‌కు బాగా విశ్వాస‌మ‌ని ల‌గ‌డ‌పాటి చెప్పారు. అందుకే ఆయ‌న‌ తొలుత 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని తెలిపారు. ఆపై నవంబర్‌ 11న మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. కేటీఆర్ రెండో ద‌ళ‌లో కోరిన 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని తెలిపారు. ‘మీ నాన్న గారు పాడు చేసిన వాతావరణాన్ని.. మీరు బాగు చేశారని కేటీఆర్‌కు మెసేజ్‌ చేశా’నని లగడపాటి అన్నారు.

నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, వాటిని ఎవ‌రితోనూ షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి సూచించారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. వీలుంటే పొత్తులతో వెళ్లాలని చెప్పానని.. అయితే తాము సింగిల్‌గానే వెళ్తామని కేటీఆర్ చెప్పారని తెలిపారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని ల‌గ‌డ‌పాటి అన్నారు
Tags:    

Similar News